చిన్నప్పటి మహేంద్ర బాహుబలి ఇప్పుడెలా ఉందో చూడండి!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే! . ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని నలువైపులా విస్తరింపజేసింది.
ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ లకి ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. అయితే బాహుబలి- ది బిగినింగ్‌లో రమ్యకృష్ణ (శివగామి) తన చేతిలో ఓ చిన్నారిని నీటిలో మునగకుండా పైకి లేపి "మహేంద్ర బాహుబలి బ్రతకాలి " అంటూ తుది శ్వాస విడిచిన సన్నివేశం అందరికి గుర్తుండే ఉంటుంది.
దీనినే మందుగా ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేస్తే వీపరితంగా క్రేజ్ వచ్చింది. అయితే ఆ చిన్నారిని చిన్నప్పటి ప్రభాస్‌గా మనకు చూపించాడు రాజమౌళి.. అయితే ఆ పాత్ర పోషించింది తన్వి అనే అమ్మాయి. సినిమా చేస్తున్న సమయంలో నెలల పిల్లగా ఉన్న తన్వీ... ఇప్పుడు చాలా పెద్దదై స్కూల్ కి వెళ్తుంది.
ప్రస్తుతం కొందరు తన్వితో దిగిన ఫోటోలను ట్విటర్‌లో పోస్టు చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బాహుబలి సినిమాలో కట్టప్ప ఎత్తుకున్న ఈ పాప(మహేంద్ర బాహుబలి) ఇప్పుడు యూకేజీ చదువుతుంది. పేరు తన్వి. @ssrajamouli pic.twitter.com/Aj31XvG6EB
— DONTHU RAMESH (@DonthuRamesh) January 27, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com