దశాబ్దకాలంగా జరిగిన రైలు ప్రమాదాలు ఇవే..!
దశాబ్ధ కాలంలో అతిపెద్ద రైలు ప్రమాదం ఒడిశాలో జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికి 292మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. తొమ్మిది వందల మంది గాయపడ్డారు.
జూన్ 2 2023 న బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు- హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి 7 గంటలకు బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద పట్టాలు తప్పింది. తీంతో ట్రాక్‌పై బోగీలు పడిపోయాయి. అదే ట్రాక్ పై షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ 120కిలో మీటర్ల వేగంతో వచ్చి.. హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. దీంతో కోరమండల్ కు చెందిన 15 బోగీలు ఒక్కసారిగా పల్టీకొట్టి పక్కనే ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. ఈ ఘటనలో 292మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
దేశంలో గతంలో జరిగిన రైలు ప్రమాదాలు ఈ విధంగా ఉన్నాయి.
1981 జూన్ 6 న బీహర్ సహర్సా ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురవగా 800మంది మృతి చెందారు.
1995 అగస్టు 20న ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో రైలు ప్రమాదం జరిగి 358 మంది మృతిచెందారు.
1998 నవంబర్ 26న ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ప్రమాదం సంభవించగా 358 మంది మృతిచెందారు.
1999 అగస్ట్ 2న అసోంలోని గైసల్ అవధ్ - బ్రహ్మపుత్ర రైళ్లు ఢీకొని 268మంది మృతిచెందారు.
2010 మే 28న పశ్చిమ బెంగాల్, మిడ్నాపూర్ జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ రైలుపై మావోయిస్టులు దాడి చేయగా 170 మంది మృతి చెందారు.
2016 నవంబర్ 20న కాన్పూర్ ఇండోర్ - పాట్నా ఎక్స్ ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురవగా 150మంది మృతిచెందారు.
2017అగస్టు 18న పూరీ-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌నగర్‌లో పట్టాలు తప్పడంతో 23 మంది మరణించారు.
2022 జనవరి పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ కనీసం 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో తొమ్మిది మంది మరణించారు.
తాజాగా 2023 జూన్ 2న బెంగళూరు- హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలును ఢీకొట్టి ఈ రెండింటిని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనగా 292మంది మరణించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com