Twitter : ఎక్స్‌లో పోస్టులు మాయం...

అమెరికన్ టైకూన్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (ఆధీనంలోని ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ (ఎక్స్) ఇటీవలే మాటిమాటికీ సతాయిస్తోంది. ఏదో ఒక సమస్యతో యూజర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇటీవలే ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడటం.. లాగిన్‌లో సమస్యలు వంటివి తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఎక్స్‌లో ఇలాంటి సమస్యే తలెత్తింది.
కొందరు యూజర్లు తమకు పోస్టులు కూడా కనిపించలేదని ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఎక్స్ యాక్సెస్ లభించకపోవడాన్ని పలు టెక్ సైట్లు కూడా నిర్ధారించాయి. ఈ ఉదయం తమకు ఎక్స్ యాక్సెస్ లభించలేదంటూ 67 వేల మందికిపైగా ఫిర్యాదు చేశారు. ఇండియన్ వెర్షన్ వెబ్‌సైట్స్‌కు ఇలాంటి ఫిర్యాదులే 4,800 వచ్చాయి. సేవలు నిలిచిపోవడంపై ఎక్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
అయితే, ఈ సారి ట్వీట్స్ మాయం అయ్యాయి. దీంతో యూజర్లు ఒకింత గందరగోళానికి గురవుతున్నారు. గురువారం ఉదయం నుంచి దేశ ప్రధాని మోదీ సహా చాలా మంది ట్విట్టర్ పోస్టులు కనిపించడం లేదు. ఆయా ఖాతాల్లోని పోస్టులు లోడ్ అవ్వడం లేదు. పోస్టులు మాయం అవ్వడంతో యూజర్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఏం జరిగిందో అర్థం కాక ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఈ సమస్యపై ఎక్స్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com