
By - Vijayanand |2 Jun 2023 3:26 PM IST
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మన్సూరాబాద్-ఎల్బీనగర్ మార్గంలో రోడ్డుపై కారు ఆపిన డ్రైవర్.. హఠాత్తుగా కారు డోర్ తీశాడు. అదే సమయంలో అటుగా వచ్చిన బైక్‌కు కారు డోర్ తగిలింది. దీంతో బైక్‌పై ఉన్న దంపతులు సహా చిన్నారి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి ధనలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాప తల్లిదండ్రులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com