అర్జంట్‌గా అక్కడందరికీ వ్యాక్సిన్ వేసేయండి ! ఆనంద్ మహీంద్రా ట్వీట్

అర్జంట్‌గా అక్కడందరికీ వ్యాక్సిన్ వేసేయండి ! ఆనంద్ మహీంద్రా ట్వీట్
దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతోన్న వేళ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు.

దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతోన్న వేళ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు.అర్జంట్‌గా మహారాష్ట్రలోని వారందరికీ కరోనా టీకా వేయాలని కోరారు. దానికోసం ఎమర్జెన్సీ పర్మిషన్ ఇవ్వాలంటూ కోరారాయన. వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచకపోతే..రెండేంటి మూడు నాలుగు వేవ్స్ కూడా చవి చూడాల్సి వస్తుందంటూ హెచ్చరించారు

ప్రతి రోజూ వెలుగు చూస్తోన్న వైరస్ కేసుల్లో సగానికిపైగా ఒక్క మహారాష్ట్ర నుంచే వస్తున్నాయ్. దేశ ఆర్థిక వ్యవస్థకి పట్టుగొమ్మలాంటి రాష్ట్రం ఇది. ఇలాంటి చోట లాక్‌డౌన్లు, కర్ఫ్ఫ్యూలు విధించడం కంటే, అందరికీ టీకా వేయించడం చాలా మంచిది. వెంటనే అందుకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలంటూ ట్వీట్ చేసారు ఆనంద్ మహీంద్రా.

తన ట్వీట్‌ని ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు వైద్యఆరోగ్యశాఖామంత్రి హర్షవర్ధన్‌కి కూడా ట్యాగ్ చేశారు. దీనికి ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, జనాలు కనుక ప్రభుత్వం నిర్ణయించిన,సరైన రక్షిత విధానాలు అమలు చేయకపోతే, మళ్లీ లాక్ డౌన్ విధిస్తామంటూ హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story