Pushpa 2 SOOSEKI Song : పుష్ప2 చిత్రం నుంచి విడుదలైన రెండో పాట
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ సీక్వెల్ ‘పుష్ప2’ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే, తొలిపాట విడుదలై రికార్డులు సృష్టించింది. ఇప్పుడు రెండో పాటను కూడా చిత్రబృందం విడుదల చేసింది.
‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ అంటూ సాగే ఈ కపుల్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పాటకు సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందించగా, లిరిక్స్ చంద్రబోస్ రాశారు. అల్లు అర్జున్ మరియు హీరోయిన్ రష్మిక మందన్న పై చిత్రీకరించిన ఈ పాట, సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది.
పుష్ప2 సినిమా పట్ల ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ శైలి, సుకుమార్ దర్శకత్వం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, అన్ని కలిసి పుష్ప2 చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. రెండో పాట విడుదల తరువాత సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
మీరు కూడా ఈ సాంగ్‌ను చూసి ఆనందించండి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com