గ్రామస్తులపై రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే

గ్రామస్తులపై రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే
సమస్యలు తీర్చమని అడిగితే చెప్పుతో కొడతానంటూ తిట్ల దండకం మొదలుపెట్టారు. సమస్యలపై ప్రస్తావించిన గ్రామస్తుడిపై నువ్వు నాకు చెప్పేదేంట్రా నా కొడకా అంటూ రెచ్చిపోయారు

అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గ్రామస్తులపై రెచ్చిపోయారు. సమస్యలు తీర్చమని అడిగితే చెప్పుతో కొడతానంటూ తిట్ల దండకం మొదలుపెట్టారు. సమస్యలపై ప్రస్తావించిన గ్రామస్తుడిపై నువ్వు నాకు చెప్పేదేంట్రా నా కొడకా అంటూ రెచ్చిపోయారు. బొమ్మనహాల్ మండలం గోవిందవాడలో కాపు రామచంద్రారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లారు.

గ్రామంలోని సమస్యలపై ఎమ్మెల్యేను గ్రామస్తులు నిలదీశారు. నెలనెలా రేషన్ సరుకులు ఇవ్వడం లేదని, పక్కా గృహాలు నిర్మించలేదని, ఏళ్ల తరబడి తమ ఆధీనంలో ఉన్న గడ్డివాము స్థలాలను వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారని కాపు రామచంద్రారెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఇంతవరకు కనీసం బీమా కూడా రాలేదంటూ ఎమ్మెల్యేను కడిగిపారేశారు. దీంతో సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యేకాపు రామచంద్రారెడ్డి ఒక్కసారిగా తీవ్ర అసహనంతో గ్రామస్తులపై దురుసు వ్యాఖ్యలు చేశారు. సమస్యలు అడిగితే చెప్పుతో కొడతానంటూ రెచ్చిపోయారు.

అటు ఎమ్మెల్యేతో పాటు వచ్చిన కానిస్టేబుల్ సైతం స్వామిభక్తి ప్రదర్శించారు. తీవ్ర పదజాలంతో గ్రామస్తులపై కానిస్టేబుల్ మండిపడ్డారు. పదేళ్లుగా ఉన్న సమస్య ఇప్పుడే ఎందుకు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారంటూ చేయి చూపించి గ్రామస్తులకు కానిస్టేబుల్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే దురుసు వ్యాఖ్యలు, కానిస్టేబుల్ తీరుపై గోవిందవాడ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story