ఆనంద మహీంద్రాని ఆకర్షించిన దోశ విక్రేత.. 'రోబో కంటే వేగంగా'.. వీడియో వైరల్
మహీంద్రాకు నచ్చిందంటే మనక్కూడా నచ్చినట్టే.. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తరచుగా తనకు నచ్చిన.. అందర్నీ ఆకట్టుకునే ఆశ్చరపరచే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈసారి మహీంద్రా ట్విట్టర్‌లో ఒక దోశ విక్రేత వీడియోను షేర్ చేశారు. అతను దాదాపు రోబోట్ లాగా చకచకా దోశలు తయారు చేయడం కనిపించింది.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో వినోదభరితమైన, సమాచార సంబంధిత వీడియోలను పంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆ ట్రెండ్‌ని కొనసాగిస్తూ మరో వీడియోను పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 28 సెకన్లు ఉన్న ఈ వీడియోలో ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి ఒక ఫ్లాట్ పాన్ మీద దోశలు వేయడాన్ని చూపిస్తుంది.
అతను బాగా కాలిన దోశను మడిచి, ఆపై వాటిని ముక్కలుగా కోసి ఓ ప్లేట్‌లో పట్టి అదించే విధానం అబ్బురపరుస్తోంది. ఇవన్నీ దాదాపు రోబోట్ లాగానే చకచకా చేసేస్తున్నాడు. ఈ వీడియోను పంచుకుంటూ మహీంద్రా ఇలా వ్రాశారు, "ఈ పెద్దమనిషి రోబోలాగా పని చేస్తున్నాడు. నేను అతడిని చూసి అలసిపోయాను.. దోశల్ని చూడగానే ఆకలి కూడా అవుతోంది అని రాశారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో 2.4 మిలియన్ల వ్యూస్‌ని సంపాదించింది. ట్విట్టర్ యూజర్లు ఈ వీడియోను చూసి సంతోషించారు. వ్యాపారి ట్వీట్‌ని వ్యాఖ్యానాలతో ముంచెత్తారు. దోశ విక్రేత నైపుణ్యాలను ప్రశంసించారు. "ఈ అద్భుతమైన క్లిప్‌లన్నీ మీరు ఎక్కడ నుండి పొందుతున్నారో అని నేను ఆశ్చర్యపోతున్నాను" అని మరోక యూజర్ రాసుకొచ్చారు.
కొన్ని రోజుల క్రితం, ఆనంద్ మహీంద్రా ఒక వ్యక్తి తన తలపై ఇటుకల కుప్పను బ్యాలెన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. 57 సెకన్ల వీడియోలో, ఒక నిర్మాణ కార్మికుడు ఒక్కొక్కటిగా తన తలపై ఇటుకలను పేర్చడాన్ని చూడవచ్చు. సన్నగా ఉన్న ఆ వ్యక్తి ఒకేసారి తన తలపై 30 ఇటుకలను పేర్చాడు. అది కూడా నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. మహీంద్రా తరచుగా మైక్రోబ్లాగింగ్ సైట్‌లో స్ఫూర్తిదాయకమైన వీడియోలను పంచుకుంటారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ట్విట్టర్ అకౌంట్‌ని 8.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
This gentleman makes robots look like unproductive slowpokes… I'm tired just watching him…and hungry, of course.. pic.twitter.com/VmdzZDMiOk
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com