చీరల కోసం కొట్టుకున్న మగువలు

చీరల కోసం కొట్టుకున్న మగువలు
మైసూరు సిల్క్ సారీ మేళాలో రసాభాస

గల్లీలో కుళాయి వద్ద లేడీస్ మధ్య జరిగే గొడవల్లో తలదూర్చే సాహసం ఎవరూ చేయరు. వాటి ప్రత్యేకత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే అలాంటి గొడవే షాపింగ్ మాల్ లో జరిగితే! నిజమే అచ్చంగా అలానే జరిగింది. బెంగళూరులో ఏటా నిర్వహించే మైసూర్ సిల్క్ మేళాకు ఎప్పటిలాగానే అతివలు ఎగబడ్డారు. పోటాపోటీగా చీరులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇంతలోనే ఒకే చీరపై ఇద్దరు లేడీస్ కళ్లు పడ్డాయి. ఇంకే ముంది, వీధి కుళాయి వద్ద జరగాల్సిన యుద్ధం, షాపింగ్ మాల్ కు షిఫ్ట్ అయింది. చీర కోసం ఇద్దరి మధ్యా హోరాహోరీగా పెద్ద యుద్ధమే సాగింది. జుట్టు పీక్కుని, ఒకరిపై మరొకరు పడిపడి కొట్టుకున్న తీరు వీడియో రూపంలో బయటకు రావడంతో ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.


Tags

Read MoreRead Less
Next Story