వైరల్ వీడియో: చేతిలో బిడ్డతో ఈ-రిక్షా నడుపుతున్న మహిళ

వైరల్ వీడియో: చేతిలో బిడ్డతో ఈ-రిక్షా నడుపుతున్న మహిళ
తల్లి ప్రేమకు కొలమానం లేదు.. ఆమె ఎన్ని కష్టాలు పడి అయినా బిడ్డలను పెంచాలనుకుంటుంది.

తల్లి ప్రేమకు కొలమానం లేదు.. ఆమె ఎన్ని కష్టాలు పడి అయినా బిడ్డలను పెంచాలనుకుంటుంది. నాన్న వదిలేసినా, నా అన్న వారు లేకపోయినా నీకు నేను ఉన్నాను అని అమ్మ బిడ్డకు భరోసాని ఇస్తుంది. పొత్తిళ్లలో పాపాయి ఉన్నా ఏం చేయడానికైనా సిద్ద పడుతుంది. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇటీవల, ఒక వైరల్ వీడియో తన కుటుంబ జీవనోపాధి కోసం ఒడిలో బిడ్డను ఉంచుకుని మరీ ఈ రిక్షా తొక్కుతోంది ఓ మహిళ. ఈ దృశ్యం నెటిజన్ల హృదయాన్ని దోచుకుంది.

బిడ్డకు తన ఒడిలో భద్రత కల్పిస్తూ, ప్రయాణికులతో నైపుణ్యంగా బేరసారాలు చేయడంతో వీడియో ప్రారంభమవుతుంది. పిల్లవాడు అమ్మ ఒడిలో హాయిగా కూర్చున్నాడు. ఈ వీడియోకు విపరీతమైన స్పందన లభించింది. ప్రజలు మహిళపై తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సహాయం అందించడానికి చాలా మంది ఆమె ఆచూకీ గురించి ఆరా తీస్తుండగా, మరికొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు.

ఈ స్ఫూర్తిదాయకమైన క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో “క్యాప్షన్ అవసరం లేదు, అమ్మ” అనే శీర్షికతో పోస్ట్ చేశారు. వీడియో 2.5 లక్షలకు పైగా వీక్షణలను పొందింది మరియు 2,19,000 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. జీవనోపాధి పొందుతూ తన మాతృ బాధ్యతలను నెరవేరుస్తున్నందుకు మెజారిటీ వ్యూయర్స్ ఆమెకు నమస్కరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story