Kuttiyamma: 104 ఏళ్ల వయసులో 4వ తరగతి.. ఏంటీ కుట్టియమ్మ కథ..

Kuttiyamma (tv5news.in)
Kuttiyamma: చదువుకు వయసుతో సంబంధం లేదు. బట్టిపట్టే చదువులు కాకుండా జ్ఞానం తెచ్చిపెట్టే చదువు ఏదైనా దానిని ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. మనం రోజూ ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటాం. అవన్నీ మనకు జ్ఞానాన్ని తెచ్చిపెట్టేవే కదా.. డిగ్రీలు ఉంటేనే జ్ఞానం ఉంది అనుకోకూడదు. అయినా డిగ్రీలే కావాలంటే.. అది సంపాదించడానికి వయసుతో సంబంధం ఏముంది. ఈ విషయాన్నే మనకు నిరూపించింది 104 ఏళ్ల కుట్టియమ్మ.
కేరళలోని కొట్టాయాంకు చెందిన కుట్టియమ్మకు 104 ఏళ్లు. ఆమె చిన్నప్పటి నుండి అసలు స్కూలుకే వెళ్లలేదు. అయితే ఆమె చదువుకోవాలన్న ఆశతో ఒక ఎన్‌జీవో నిర్వహిస్తున్న క్లాసులకు వెళ్లడం మొదలుపెట్టింది. 'సాక్షరత ప్రేరక్ రెహ్నా' ఆ ఎన్‌జీవో నిర్వహించిన ప్రోగ్రాంలో ఉదయం, సాయంత్రం వయసుతో సంబంధం లేకుండా అందరికీ చదువు చెప్పేవారు. కుట్టియమ్మ కూడా ఆ క్లాసులకు వెళ్లింది.
అలా కుట్టియమ్మ 4వ తరగతి పరీక్షలు రాయడానికి అర్హత సంపాదించింది. 104 ఏళ్లు వచ్చాయి కాబట్టి తనకు వినికిడి సమస్య కూడా ఉండేదట. అందుకే ఎగ్జామ్ హాల్‌లో ఇన్విజిలేటర్లు తనకోసం ప్రత్యేకంగా గట్టిగా మాట్లాడేవారట. అలా ఆమె నలుగో తరగతి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసింది. అంతే కాకుండా అందులో 89 మార్కులు సాధించింది కూడా.
అప్పటివరకు స్కూలు జోలికే వెళ్లని కుట్టియమ్మ ఒక్కసారిగా నాలుగో తరగతి పరీక్షలు రాయడం.. అందులో 89 మార్కులతో పాస్ అవ్వడం చూసి చాలా సంతోషపడింది. అలా తను నవ్వుతున్న ఫోటోను కేరళ ఎడ్యుకేషన్ మినిష్టర్ వాసుదేవన్ శివన్‌కుట్టి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో కుట్టియమ్మ పెద్ద స్టార్ అయిపోయింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు కుట్టియమ్మ డెడికెషన్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు కూడా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com