ప్రాణాల మీదకు తెచ్చిన సరదా.. కొండ అంచున ఊయల ఊగుతూ 6,300 అడుగుల లోయలో..!
ఊయల ఎక్కడ కనిపించినా ఊగేయాలనిపిస్తుంది. చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా ఊయల ఊగేందుకు సరదా పడుతుంటారు. ఆ ఇద్దరమ్మాయిలు కూడా అలానే సరదా పడ్డారు. కానీ అది వారు చేయబోయే సాహసం అని అనుకోలేదు. ఎక్కేందుకు సరదా పడ్డారు. ఎక్కిన తరువాత గుండె చేత్తో పట్టుకున్నారు. రష్యాలోని డాగేస్టాన్‌లో 6,300 అడుగుల ఎత్తైన కొండపై ఏర్పాటు చేసిన ఊయలలో ఊగేందుకు పర్యాటకులు మక్కువ చూపుతుంటారు.
ఇద్దరు అమ్మాయిలు ఊగుతున్నప్పుడు అనుకోకుండా ఆ ఎత్తైన కొండపైనుంచి పడిపోయారు. అదృష్టవశాత్తు వారు కొండ అంచున పడడంతో ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే అంత ఎత్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయేవారు. ఇద్దరు అమ్మాయిలు ఊయలలో కూర్చున్న తరువాత వెనుక నుంచి ఓ వ్యక్తి బలంగా ఊపుతున్నారు. అంతలోనే ఊయల గొలుసు విరిగి, పల్టీలు కొట్టింది.
ఈ హఠాత్ పరిణామానికి అక్కడున్న పర్యాటకులు అంతా అరుస్తూ అమ్మాయిలు పడిపోయిన వైపు పరిగెత్తారు. అదృష్టవశాత్తు బాలికలు నిటారుగా ఉన్న కొండ అంచు వైపు పడ్డారు. దాంతో ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఇది ప్రమాదకర చర్య అని, తగిన జాగ్రత్తలు లేవని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com