ప్రకటన చూసి 23 లక్షల మంది ప్రేక్షకులు కన్నీళ్లు..

ప్రకటన చూసి 23 లక్షల మంది ప్రేక్షకులు కన్నీళ్లు..
X
ఇది కేవలం కమర్షియల్ యాడ్ కాదు.. ఓ ఎమోషన్.. బంధాలను, అనుబంధాలను పెంపొందిస్తుంది. ఏ స్త్రీకైనా మాతృత్వం ఓ వరం.. ఓ మధుర జ్ఞాపకం.

సున్నితమైన విషయాలను కూడా సునిశితంగా వివరిస్తూ ప్రకటనలు రూపొందించడం ప్రకటనదారుల క్రియేటివిటీకి నిదర్శనం. ఓ యాడ్ ఆలోచించేలా చేస్తుంది. మరో యాడ్ కుటుంబ బాంధవ్యాల్ని ప్రతిబింబిస్తుంది. ఒక యాడ్ పాలల్లోని పౌష్టికతను వివరిస్తే.. మరొకటి తమ ప్రొడక్టే ఎందుకు కొనాలో కస్టమర్‌కి కళ్లకి కడుతుంది. ఓ యాడ్ చూసి ఆ వస్తువు కొనాలో లేదో పక్కన పెడితే ఈ యాడ్ మాత్రం దేశంలోని 23 లక్షల మంది చేత కన్నీళ్లు పెట్టించింది.

ఇది కేవలం కమర్షియల్ యాడ్ కాదు.. ఓ ఎమోషన్.. బంధాలను, అనుబంధాలను పెంపొందిస్తుంది. ఏ స్త్రీకైనా మాతృత్వం ఓ వరం.. ఓ మధుర జ్ఞాపకం. ఆ ఆనంద క్షణాలను ఆస్వాదించాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. కానీ మనదేశంలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సంతానం లేనంత మాత్రాన ఆ స్త్రీకి సంపూర్ణత్వం సిద్ధించదా అనే కాన్సెప్ట్‌ను ప్రధానంగా తీసుకుని రూపొందించిన ప్రకటన ఇది.

నిత్య జీవితంలో ఎన్నో పాత్రల్ని సమర్తవంతంగా పోషించిన స్త్రీ.. తల్లి కాలేకపోయిందన్న ఒకే ఒక్క కారణంతో అసంపూర్ణంగా మిగిలిపోయిందనుకోవడం అర్థం లేని తనం. ఇటువంటి సునిశిత అంశాన్ని ప్రధానంగా తీసుకుని రూపొందించిన ప్రకటన ఇది. ఇంటికి పెద్ద కోడలిగా, ఉద్యోగినిగా ఎన్నో బాద్యతల్ని ఒంటి చేత్తో చక్కబెట్టే లతకు సంతానం లేదు. తన తర్వాత ఇంట్లోకి అడుగుపెట్టిన తోడికోడలు గర్భం దాలుస్తుంది. ఇంట్లో వాళ్లు ఆమె సీమంతానికి ఏర్పాట్లు చేస్తుంటారు. దాంతో లత కళ్లలో కనిపించని బాధ కన్నీటి రూపంలో బయటపడుతుంది.

అయినా ఆ బాధని దిగమింగుకుని తోడికోడలి సీమంతపు సంబరాల్లో పాలు పంచుకుంటుంది. అక్క లత గుండెల్లోని బాధను గుర్తించిన తోడికోడలు ఆమె దగ్గరకి వచ్చి అక్కా నీ పేరే నా పాపకు పెట్టుకుంటా అని చెప్పడంతో ఈ యాడ్ ముగుస్తుంది. దాంతో లత ఆనందానికి అవధులు ఉండవు. ఈ యాడ్ ముఖ్య ఉద్దేశం అసలు స్త్రీగా పుట్టడమే సంపూర్ణత్వం అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. మనసుని కదిలించే ఈ ప్రకటన ఇంతవరకు 23 లక్షల మంది వీక్షించారు. షీ ఈజ్ కంప్లీట్ ఇన్ హర్‌‌సెల్ఫ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఈ ప్రచారాన్ని చేస్తున్నారు.


Tags

Next Story