Kemune: 3,400 ఏళ్లనాటి పురాతన నగరం.. ఇన్నాళ్లకు బయటపడింది..
Kemune: ఇరాక్ కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఓ భారీ జలాశయం కరువు వల్ల ఎండిపోయింది.

Kemune: కరువుతో నిత్యం అలమటించిపోయే దేశాల్లో ఇరాక్ ఒకటి. అలాంటి ఇరాక్‌లో ఇటీవల ఓ జలాశయం ఎండిపోయింది. కానీ అది ఎండిపోవడం వల్లే ఓ అద్భుతం బయటపడింది. ఇంతకాలంగా ఆ జలాశయం కింద ఓ నగరం దాగి ఉందన్న విషయం.. అది ఎండిపోయిన తర్వాతే తెలిసింది. అందుకే వెంటనే కుర్దిష్, జర్మనీ ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని పరీక్షించి మరిన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
ఇరాక్ కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఓ భారీ జలాశయం కరువు వల్ల ఎండిపోయింది. దీంతో 3,400 ఏళ్లనాటి పురాతన నగరం బయటపడింది. ఈ నగరం దాదాపు క్రీస్తూ పూర్వం 1550 నాటిది అని అంచనా వేస్తున్నారు పూరావస్తు శాస్త్రవేత్తలు. అంతే కాకుండా మిట్టని సామ్రాజ్య పాలన సమయంలో ఈ నగరం ప్రధాన కేంద్రంగా ఉండి ఉండవచ్చని వారు భావిస్తున్నారు.
ఇక కరువు వల్ల ఎండిపోయిన జలాశయం వల్ల ఈ నగరం బయటపడింది. అయితే మళ్లీ ఆ జలాశయంలో మెల్లగా నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. దీంతో ఆ నగరం దెబ్బతినకూడదని ప్లాస్టిక్ షీట్‌లతో దీన్ని మొత్తం కప్పేశారు. మట్టి గోడలు, శిథిలాలు చాలా పురాతన కాలం నాటివి కాబట్టి నీటి వల్ల సులభంగా ధ్వంసం అయ్యే అవకాశం ఉందని వారు ఈ పని చేసినట్టుగా శాస్త్రవేత్తలు తెలిపారు.
RELATED STORIES
Vice President: ఉప రాష్ట్రపతి అభ్యర్ధిపై కొనసాగుతున్న సస్పెన్స్..
3 July 2022 11:53 AM GMTDivorce: 'టీవీ లేకపోతే భార్య ఉండదు..' విడాకులకు వింత కారణం..
2 July 2022 4:15 PM GMTSharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఐటీ నోటీసులు.. ప్రేమలేఖతో...
1 July 2022 11:45 AM GMTNupur Sharma: నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. వారికి క్షమాపణలు...
1 July 2022 11:00 AM GMTMaharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్...
1 July 2022 9:00 AM GMTMaharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
29 Jun 2022 4:22 PM GMT