Bihar : 36 అంగుళాల వరుడు.. 34 అంగుళాల వధువు..!

Bihar : బిహర్ భగల్‌పుర్‌లో అరుదైన వివాహం జరిగింది.. గోపాల్‌పుర్ బ్లాక్‌లో ఇద్దరు మరుగుజ్జు వధూవరులు పెళ్లి చేసుకున్నారు. వరుడు విందేశ్వరి మండలానికి చెందిన వరుడు మున్నా వయస్సు 26 సంవత్సరాలు.. అతని ఎత్తు 36 అంగుళాలు.. ఇక వధువు పేరు మమత కుమారి 24 సంవత్సరాలు.. ఆమె ఎత్తు 34 అంగుళాలు.
ఈ అరుదైన పెళ్లిని చూడడానికి పెద్ద సంఖ్యలో ఆహ్వానం లేని వ్యక్తులు కూడా హాజరయ్యారు.. అంతేకాకుండా వారితో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. దీనితో ఈ వివాహం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది.
దీనిపైన వరుడు మున్నా తండ్రి విందేశ్వరి మండల్ మాట్లాడుతూ.. 36 అంగుళాల పొడవున్న తన కొడుకు కోసం పెళ్లికూతుర్ని వెతకడం చాలా కష్టమైందని, కానీ తమ జిల్లాలోనే అంతే ఎత్తుతో ఉన్న వధువు దొరకడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com