Video Viral: మిరాకిల్.. కారు బోల్తా పడినా..

Video Viral: మిరాకిల్.. కారు బోల్తా పడినా..
X
Video Viral: అదృష్టం అంతే.. టైమ్ బావుండకపోతే కర్రే పామై కరుస్తుందన్న సామెత అందుకే వచ్చిందేమో.

Video Viral: అదృష్టం అంతే.. టైమ్ బావుండకపోతే కర్రే పామై కరుస్తుందన్న సామెత అందుకే వచ్చిందేమో. చిన్న యాక్సిడెంట్ కూడా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఇక్కడ జరిగింది మామూలు యాక్సిడెంట్ కానే కాదు. చాలా స్పీడుగా వస్తున్న ఉన్న కారు డివైడర్‌కు ఢీకొని బోల్తా పడింది. అయినా అందులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు.. సాయపడిన స్థానికులకు ధన్యవాదాలు చెప్పి ఊపిరి పీల్చుకున్నారు యాక్సిడెంట్ నుంచి బయటపడిన వాళ్లు.

కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో చిన్నారితో సహా, మరో ముగ్గురు అద్భుతంగా బయటపడ్డారు. కేరళలోని కోజికోడ్‌లో వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టడంతో పసిపాపతో సహా నలుగురు వ్యక్తులు బయటపడ్డారు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డవడంతో వైరల్ అయ్యాయి. మంగళవారం రాత్రి కోజికోడ్‌లోని కరుమల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు ప్రయాణికులను కారులో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు సహకరించారు. నలుగురు ప్రయాణీకులలో ఒకరికి చేతికి గాయమైంది. చికిత్స నిమిత్తం అతడిని దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Tags

Next Story