వైరల్

Madhya Pradesh : ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం.. ఆరుగురు పిల్లల ఎదుట పెళ్లి..!

Madhya Pradesh : మధ్యప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి గత పదిహేనేళ్ళుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేశాడు.

Madhya Pradesh : ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం.. ఆరుగురు పిల్లల ఎదుట పెళ్లి..!
X

Madhya Pradesh : మధ్యప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి గత పదిహేనేళ్ళుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేశాడు..అతనికి ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు.. తాజాగా ఆ ఆరుగురు పిల్లల ఎదుటే ఒకే వేదిక పైన ఆ ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. అలీరాజపూర్‌లోని గిరిజిన తెగకు చెందిన సమర్థ్‌ మౌర్య(42) నాన్‌బాయి, మేళా మరియు సక్రి అనే ముగ్గురు మహిళలతో సహజీవనం చేసి ఆరుగురు పిల్లలకి తండ్రయ్యాడు. గిరిజన ఆచారాల ప్రకారం మూడు రోజుల పాటు జరిగింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో తన మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత మరో ఇద్దరితో సహజీవనం చేశానని చెప్పాడు.

Next Story

RELATED STORIES