Delhi: హోమ్ వర్క్ చేయలేదని చిన్నారిపై తల్లి దాష్టీకం.. మండుటెండలో మిద్దెపై..

Delhi: హోమ్ వర్క్ చేయలేదని చిన్నారిపై తల్లి దాష్టీకం.. మండుటెండలో మిద్దెపై..
Delhi: అయిదేళ్ల చిన్నారి హోమ్ వర్క్ చేయలేదని.. కాళ్లు, చేతులు కట్టేసి మధ్యాహ్నం మండుటెండలో మిద్దెపై పడేసింది ఓ తల్లి.

Delhi: హోమ్ వర్క్ చేయకపోయినా.. చెప్పినట్టు వినకపోయినా.. పిల్లలను శిక్షించే హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ ఆ శిక్షకు కూడా ఓ లిమిట్ ఉంటుంది. పిల్లలను హాని కలిగించేలా శిక్షలు విధించే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందా..? పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులకు ఎలాంటి శిక్షలయినా వేయవచ్చా..? ఢిల్లీలో జరిగిన ఓ ఘటన ప్రజలలో ఇలాంటి ప్రశ్నలను లేవనెత్తేలా చేస్తోంది.

ఢిల్లీలోని ఖజూరీ ఖాస్‌ ప్రాంతంలో అయిదేళ్ల చిన్నారి హోమ్ వర్క్ చేయలేదని.. కాళ్లు, చేతులు కట్టేసి మధ్యాహ్నం మండుటెండలో మిద్దెపై పడేసింది ఓ తల్లి. ఢిల్లీలో మధ్యహ్నం ఎండలో సమయంలో మామూలుగా బయటికి వెళ్లడమే కష్టం అయిపోయిన ఈ సమయంలో.. మండుటెండలో చిన్నారి పెడుతున్న కేకలు ఎంతోమందిని కదిలించాయి.

ఈ హృదయ విదారక ఘటన జూన్ 2న చోటుచేసుకుంది. పొరుగింటి నుండి ఓ మహిళ మిద్దెపై ఉన్న చిన్నారి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ అవ్వడంతో చిన్నారి తల్లిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికీ నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.


Tags

Next Story