Jagtial : 72 ఏళ్ల వ‌య‌స్సులో బామ్మ..ఓపెన్ జిమ్ లో కసరత్తులు... !

Jagtial :  72 ఏళ్ల వ‌య‌స్సులో బామ్మ..ఓపెన్ జిమ్ లో కసరత్తులు... !
X
Jagtial : కానీ కృష్ణా రామా అనుకుంటూ ఓ మూలన ఉండాల్సిన ఓ 72 ఏళ్ల బామ్మ మాత్రం ఓపెన్ జిమ్‌లో ప్రతిరోజూ క‌స‌ర‌త్తులు చేస్తుంది.

Jagtial : మంచి వయసులో ఉన్నవారే వ్యాయామం చేయాలంటే బద్దకిస్తున్నారు.. కానీ కృష్ణా రామా అనుకుంటూ ఓ మూలన ఉండాల్సిన ఓ 72 ఏళ్ల బామ్మ మాత్రం ఓపెన్ జిమ్‌లో ప్రతిరోజూ క‌స‌ర‌త్తులు చేస్తుంది. అన్ని రకాల జిమ్ పరికరాల పైన వ్యాయామం చేస్తూ అదరగొడుతోంది.

ఇంతకీ ఈ బామ్మ ఎవరంటే... జ‌గిత్యాల జిల్లాలోని శంకుల‌ప‌ల్లె గ్రామానికి చెందిన ఈ బామ్మ పేరు నీలి పెద్ద రాజ‌వ్వ.. 72 సంవత్సరాల వయసు ఉంటుంది.. గృహిణి అయిన ఈ బామ్మకి ఆరోగ్యం పైన శ్రద్ధ ఎక్కువే.. ప్రతిరోజూ చేసిన జిమ్ లో కసరత్తులు చేస్తుంది.

కనీసం రోజు జిమ్‌లో 40 నిమిషాలు వ్యాయామం చేస్తుంది. ఆమె వ్యాయామం చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Tags

Next Story