శునకం పైన ప్రేమతో.. ఓ యజమాని ఏం చేశాడంటే.. ?

శునకం పైన ప్రేమతో.. ఓ యజమాని ఏం చేశాడంటే.. ?
పెంపుడు జంతువులంటే చాలా మందికి ప్రాణం అన్న సంగతి తెలిసిందే.. ఇందులో ఎక్కువగా చాలా మంది కుక్కలను పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు.

పెంపుడు జంతువులంటే చాలా మందికి ప్రాణం అన్న సంగతి తెలిసిందే.. ఇందులో ఎక్కువగా చాలా మంది కుక్కలను పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఒకవేళ దానికి ఏమైనా కష్టం వస్తే అల్లాడిపోతుంటారు. ఇక అది తిరిగిరాని లోకాలకి వెళ్తే చాలా బాధపడుతారు. ఇంట్లో ఓ మనిషి ఇక లేడన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. అలాగే ఇక్కడ శునకం పైన ఉన్న ప్రేమని ఓ య‌జ‌మాని వినూత్నంగా తెలియజేశాడు.

కృష్ణా జిల్లాకి చెందిన సుంకర జ్ఞానప్రకాశరావు అనే వ్యక్తి ప్రేమతో ఓ కుక్కను పెంచుకున్నాడు. దానికి ముద్దుగా శునకరాజు అనే పేరును కూడా పెట్టుకున్నాడు. అయితే అనుకోకుండా ఓ రోజు ఆ కుక్క చనిపోయింది. దీనితో అతను చాలా బాధపడ్డాడు. ఆ బాధను తట్టుకోలేక ప్రతి సంవత్సరం దానికి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నాడు. ఆ కుక్క జ్ఞాపకార్ధంగా ఏకంగా కాంస్య విగ్రహం కూడా చేయించాడు.


తాజాగా ఆ శునకరాజు 5వ వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆ కుక్క ఆత్మకు శాంతి కలగాలని శాస్త్రీయ బద్దంగా పండితుల చేత ప్రత్యేక పూజలు కూడా నిర్వహించాడు. అంతేకాకుండా స్థానికులకు పిలిచి విందు భోజనాలు ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం మనమున్న సమాజంలో మన అనుకున్న వాళ్లు చనిపోతేనే ఆఖరి చూపు చూసేందుకు ఎవరు కూడా రావడం లేదు. అలాంటిది ఓ కుక్క చనిపోతే ఆ యజమాని ఇంతాలా ప్రేమను చూపించడం అందరిని ఆశ్చరానికి గురిచేసింది.

Tags

Read MoreRead Less
Next Story