Viral Video: చికట్లో వింత ఆకారం..ఏలియన్గా భావించిన నెటిజన్స్..తీరా చూస్తే

Photo Credit: Twitter
అర్థరాత్రి సమయంలో తెల్లటి ముసుగుతొడిగి ఇంట్లో నిలబడివున్న ఆకారన్ని చూసిన వారంతా ఆదో ఆత్మని భావించారు. కాదు ఏలియన్ కావచ్చు అని మరికొందరూ.. ఇక గ్రహాంతరవాసుల గురించి ఎన్ని వార్తలు వచ్చిన బోర్ కొట్టకుండా చూస్తారు జనం. ఏలియన్ గురించి సామాజిక మాధ్యమాల్లో అయితే రకరకాల వదంతులు వస్తుంటాయి. దీంతో ఏలియన్స్ రాత్రి సమయంలో ఆ ఇంట్లో ఎందుకు దిగింది అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
ఏలియన్ ముసుగుతొడిగి ఉండటం ఏంటి? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అసలు గ్రహాంతర వాసి భూమిపైకి ఎందుకు వచ్చింది అంటూ కొందరూ నెటిజన్లు చర్చలు మొదలు పెట్టారు. పూర్తి వీడియో చూడకుండా ఇలా అనేక రకాలుగా చర్చలు మొదలు పెట్టారు.15 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన తర్వాత వారిలో వారే నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏంముంది అనే కదా మీ సందేహం.. ఈ వీడియోలో పిల్లి ఉంది. తెల్లటి ముసుగు కప్పుకొని పిల్లి నిల్చొచి ఉంది. అంతేకాదు అది కొంటెగా కన్నూ కూడా కొడుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరు కూడా చూడండి.
Bhutni ke pic.twitter.com/n3VLs6xvhW
— Kaptan Hindustan™ (@KaptanHindostan) July 15, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com