Helicopter Bhel Puri: మార్కెట్లోకి కొత్త డిష్.. హెలికాప్టర్ భేల్ పూరీ గురించి విన్నారా..?
Helicopter Bhel Puri: స్ట్రీట్ ఫుడ్ అంటే చాలామంది చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు చాలామంది స్ట్రీట్ ఫుడ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇకపోతే ఈ స్ట్రీట్ ఫుడ్‌లో చాలా రకాల వంటకాలు ఉంటాయి. నార్త్ స్టేట్స్‌లోని చాలా రకాల స్ట్రీట్ ఫుడ్స్.. సౌత్‌లో కూడా చాలా ఫేమస్. అలాంటి ఒక డిష్ భేల్ పూరీ. కానీ ఈమధ్య కొత్తగా హెలికాప్టర్ భేల్ పూరీ అనేది మార్కెట్లోకి వచ్చింది. దాని గురించి విన్నారా..?
ఈమధ్యకాలంలో స్ట్రీట్ ఫుడ్ చేసేవారు, మార్కెట్లో పండ్లు, కూరగాయలు అమ్మేవారు.. క్రియేటివ్‌గా ఆలోచిస్తూ ఫేమస్ అయిపోతున్నారు. తాజాగా ఓ స్ట్రీట్ ఫుడ్ చేసే వ్యక్తి భేల్ పూరీని వెరైటీగా చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయినా మామూలు భేల్ పూరీకి, హెలికాప్టర్ భేల్ పూరీకి తేడా ఏమీ లేదు. అతడు దాన్ని చేసే విధానమే.
ఒక గిన్నెలో భేల్ పూరీకి కావాల్సినవి అన్నీ వేసి మెరుపు వేగంతో కలిపాడు ఆ వ్యక్తి. అతడి చేయి అచ్చం హెలికాప్టర్ ఫ్యాన్‌లాగా తిరిగింది. తన చేతుల్లో ఇంత బలంగా ఎలా వచ్చింది అంటూ వీడియో చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. కొద్ది గంటల్లోనే ఈ వీడియో వైరల్ అవ్వడంతో అసలు హెలికాప్టర్ భేల్ పూరీ అంటే తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com