Donate Money To People : శభాష్.. కూతురు పెళ్లి ఖర్చు మొత్తాన్ని పేదలకి పంచేశాడు..!

Donate Money To People : దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను కూడా విధించాయి. ఇక వివాహ కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలో హాజరుకావాలని ఆంక్షలు కూడా విధించాయి. ప్రజలు కూడా పూర్తి లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ అతి తక్కువ మందితో పెళ్లిళ్లు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగానే ఓ తండ్రి తన కూతురి పెళ్లిని నిరాడంబరంగా నిర్వహించి, ఆ పెళ్లికి అయ్యే ఖర్చు మొత్తాన్ని పేద కుటుంబాలకు పంచిపెట్టాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. మైసూరుకి చెందిన హరీష్ అనే వ్యక్తి తన కుమార్తె వివాహాన్ని మే 12, 13వ తేదీల్లో పెట్టుకున్నాడు.
అయితే అప్పటికే రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోకి రావడంతో పెళ్లిని అతి కొద్ది మంది సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించాడు. తన కూతురు పెళ్లి కోసం దాచుకున్నా రెండు లక్షల డబ్బును ఐదు వేల చొప్పున 40 పేద కుటుంబాలకి పంచిపెట్టాడు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆయనని ప్రశంసిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com