Viral Video : మెట్రోస్టేషన్ పైకెక్కి యువతి ఆత్మహత్యాయత్నం.. చాకచక్యంగా పోలీసులు..

అప్పటివరకు ప్రశాంతంగా ఉంది దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని ఫరీదాబాద్ మెట్రోస్టేషన్.. కానీ ఓ యువతి మెట్రో స్టేషన్ పైనుంచి దూకడానికి ప్రయత్నించి అందరిని అలర్ట్ అయ్యే పరిస్థితులను తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శనివారం సాయంత్రం ఆరున్నర గంటల సమయానికి ఫరీదాబాద్‌లోని సెక్టార్ 28 మెట్రోస్టేషన్ బాల్కనీపైకి చేరుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించిన ప్రయాణికులు పోలీసులకి సమాచారం అందించారు.
వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. స్టేషన్ కింద నిల్చొని ఎస్సైతోపాటు మరికొందరు ఆమెను మాటల్లోకి దింపారు. ఆ క్రమంలో కానిస్టేబుల్ బాల్కనీ పైనున్న యువతి వద్దకు చేరుకొని ఆమె చేయిని గట్టిగా పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ యువతి విడిపించుకునేందుకు ప్రయత్నించింది. వెంటనే మరో వ్యక్తి వచ్చి ఆమెను పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి ఆమెను బాల్కనీ నుంచి స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. విచారణ సమయంలో పనిసంబంధిత ఒత్తిడి కారణంగా తన జీవితాన్ని ముగించాలని కోరుకుంటున్నట్లు యువతి పోలీసులకు తెలిపింది.
తరువాత యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె కుటుంబానికి అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియోని పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయగా, వీడియో వైరల్ గా మారింది. యువతిని చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్ సర్ఫరాజ్‌ను పోలీసు కమిషనర్ ఓపీ సింగ్ అభినందించారు.
@FBDPolice @cmohry
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 25, 2021
फरीदाबाद पुलिस के सबइंस्पेक्टर धनप्रकाश और कॉन्स्टेबल सरफराज की बहादुरी,खुदकुशी के आमादा एक लड़को को मेट्रो स्टेशन पर कुछ इस तरह बचाया,लड़की काम को लेकर डिप्रेशन में थी pic.twitter.com/yEN5WJnA59
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com