Viral: లక్షలు ఖర్చుపెట్టి కుక్కగా మారిన మనిషి..

Viral: లక్షలు ఖర్చుపెట్టి కుక్కగా మారిన మనిషి..
కుక్కగా మారేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేసిన జపాన్ కు చెందిన టోకో

కొందరి కోరికలు చేసేందుకే కాదు చెప్పేందుకు కూడా భిన్నంగా, చిత్రంగా కూడా అనిపిస్తాయి. వారి కోరికలు విన్నపుడు ఇదేం వింత కోరిక అని అనుకుంటాం. కానీ అదే అమల్లోకి వస్తే.. పలు రకాలుగా కామెంట్స్ చేస్తాం. ఒకవేళ దాని వల్ల పేరొస్తే.. మనమే దాన్ని మెచ్చుకుంటాం. కొందరు ఈ మనిషి బతుకు కంటే ఏ కుక్కలాగో పుట్టుంటే బాగుండు అని అంటుండడం చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు మీరూ అన్నారేమో.. ఒకసారి గుర్తు చేసుకోండి.. అలాగే జపాన్ కు చెందిన ఓ వ్యక్తి వింత కోరిక కలిగింది. తాను జంతువుగా మారితే ఎలా ఉంటానో చూసుకోవాలని కలగన్నాడు. కేవలం కలగనడమే కాదు.. దాన్ని నిజం చేసుకున్నాడు కూడా. అదేంటో ఇప్పుడు చూద్దాం...

జపనీస్ వ్యక్తి టోకో తాను జంతువుగా మారితే ఎలా ఉంటానో చూడాలని, దాన్నే జీవితకాల కోరికగా పెట్టుకున్నాడు. ఆ కలను నెరవేర్చుకునేందుకు కుక్కలా మారాడు. దానికి కోలి అనే పేరు కూడా పెట్టుకున్నాడు. అంతే కాదు దాని కంటే 20వేల కంటే ఎక్కువ డాలర్లు ఖర్చు చేసి జంతువుగా మారాలన్న తన కలను నిజం చేసుకున్నాడు. ఈ వీడియోను ఐ వాంట్ బి ఏ యానిమల్ అనే యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ కూడా చేశాడు. ఈ వీడియోలో టోకో తన పెరట్లో నాలుగు కాళ్లతో ఆడుకుంటూ, విన్యాసాలు చేస్తూ కొత్త అవతార్ లో కనిపిస్తున్నాడు.

అచ్చం కుక్కలా కనిపించే టోకో.. ఆ తర్వాత టోకో పబ్లిక్ లో వాక్ చేస్తూ కనిపించాడు. ఇతర కుక్కల్లాగే పార్కులో తిరుగుతూ ఎంజాయ్ చేశాడు. కుక్క వేషంలో ఉన్న ఇతర నిజమైన కుక్కలు కూడా అతన్ని కుక్కే అనుకున్నాయి. టోకో మొదట్లో అలా బయట నడిచేందుకు భయపడ్డా... ఆ తర్వాత మాత్రం తన కల నెరవేర్చుకోవాలన్న సంకల్పంతో ఆ భయాన్ని అధిగమించాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న కుక్కగా మారిన టోకో వీడియో వైరల్ గా మారింది.

అయితే టోకో తాను కుక్కలా మారేందుకు జపనీస్ కంపెనీ జెప్సెట్ సహాయాన్ని తీసుకున్నాడు. అంతే కాదు ఈ కుక్క దుస్తుల కోసం 22వేల డాలర్లు ఖర్చు పెట్టాడు. దీని వల్ల అతను నాలుగు కాళ్లతో నడిచే నిజమైన కోలీ కుక్క రూపాన్ని తలపించేలా కనిపించే కల నెరవేరింది.




Tags

Read MoreRead Less
Next Story