పాత్రలో లీనమై.. నాటకంలో హత్యాయత్నం..!
నాటకంలో లీనమై.. ఓ పాత్రధారి మరో పాత్రధారి ప్రాణాలు తీయబోయిన ఘటన కలకలం రేపింది. సహజంగా కళాకారులు పాత్ర రక్తికట్టేందుకు అందులోకి పరకాయ ప్రవేశం చేస్తుంటారు. సినిమాల్లో మాట ఎలా ఉన్నా.. రంగస్థలంలో మాత్రం పాత్రలకు మరింత జీవం పోస్తుంటారు. ఐతే.. మరొకరి ప్రాణాలు తీయాలనుకునేంతగా పాత్రలో జీవిస్తే మాత్రం ఇబ్బంది తప్పదు. ఇలాంటి ఘటనే కర్ణాటకలోని మాండ్యాలో జరిగింది.
ఓ నాటక సన్నివేశంలో భాగంగా చాముండేశ్వరి పాత్ర ధరించిన ఓ వ్యక్తి అందులో లీనమై మహిషాసురుడి పాత్రలో ఉన్న మరో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ నెల 6న మాండ్యాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
చాముండేశ్వరి పాత్రలో ఉన్న వ్యక్తి త్రిశూలంతో మహిషుడి పాత్రలో ఉన్న వ్యక్తిని పొడిచేందుకు యత్నించాడు. నిర్వాహకులు వెంటనే అడ్డుకోవటంతో ప్రమాదం తప్పింది. మహిషుడి పాత్రలో ఉన్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. చాముండేశ్వరి పాత్రలో ఉన్న వ్యక్తి అందులో లీనమవడమే హత్యాయత్నానికి కారణమని భావిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com