Rakshabandhan: 'చెల్లెలు కావలెను'.. డేటింగ్ యాప్‌లో యువకుడి విజ్ఞప్తి..

Rakshabandhan: చెల్లెలు కావలెను.. డేటింగ్ యాప్‌లో యువకుడి విజ్ఞప్తి..
Rakshabandhan: డేటింగ్ యాప్‌లో ఫోటోలతో పాటు మంచి బయోను కూడా పెట్టాల్సి ఉంటుంది.

Rakshabandhan: ఈమధ్యకాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఫ్రెండ్‌షిప్ చేయాలంటే సోషల్ మీడియా ఉంటే చాలు. అదే వారిని దగ్గర చేస్తుంది. అలాగే ఓ తోడు కావాలి అనుకునేవారు కూడా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఎన్నో డేటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మాములుగా డేటింగ్ యాప్స్‌ను గర్ల్‌ప్రెండ్ కావాలి లేదా ఒక మంచి ఫ్రెండ్ కావాలి అనుకునేవారు ఉపయోగిస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం అందులో తనకు ఓ చెల్లి కావాలని రిక్వెస్ట్ పెట్టాడు.

డేటింగ్ యాప్‌లో ఫోటోలతో పాటు మంచి బయోను కూడా పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఆ బయోలో తనకు చెల్లెలు కావాలని రాసుకొచ్చాడు ఓ యువకుడు. 'నాకు చెల్లెలు లేకపోవడం వల్ల ప్రతీసారి రాఖీ పండగకు నేనేదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. నాకు రాఖీ కట్టడానికి, గిఫ్ట్ అందుకోవడానికి ఎవరూ లేరు. అందుకే గత రెండేళ్లుగా రాఖీ పండగకు రెండు వారాలు ముందు నేను ఇలా బయో పెడుతున్నాను'.

'రాఖీ పండుగకు సంతోషంగా గడపడానికి ఒక చెల్లెలి కోసం చూస్తున్నాను. టిండర్‌కు థాంక్యూ. ఇప్పటివరకు దీని వల్ల నాకు ఇద్దరు చెల్లెల్లు దొరికారు. ఈ ఏడాది మేము ముగ్గురం కలుసుకొని రాఖీని జరుపుకోవాలి అనుకుంటున్నాం. నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది' అని రాసుకొచ్చాడు. ఈ వింత ఐడియా చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. గర్ల్ ఫ్రెండ్‌ను వెతకాల్సిన చోట చెల్లెలిని వెతుక్కోవడం నిజంగా వింతే.



Tags

Read MoreRead Less
Next Story