హ్యాట్సాఫ్: పెళ్లిని లెక్కచేయలేదు... ఓ చిన్నారికి ఊపిరి పోశారు..!

వారి పెళ్లి రోజు వారికి గుర్తుంటుందో లేదో కానీ.. వారి చేసిన పని మాత్రం.. ఓ చిన్నారి తల్లిదండ్రులకి మాత్రం జీవితాంతం గుర్తుంటుంది. ఇంతకీ వారు ఏం చేశారంటే.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకులు అయిపోయి.. ఇక గృహప్రవేశం చేయాల్సిన సమయం అది.. కానీ అ జంట మాత్రం నేరుగా ఆసుపత్రికి వెళ్ళింది.
అక్కడ సమయానికి రక్తం లభించక.. ప్రాణాల కోసం పోరాడుతున్న ఓ చిన్నారికి రక్తం అందించి ఊపిరి పోశారు. ఈ సందర్భంగా ఆ కొత్త జంటను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పోలీస్ అధికారి ఆశిష్ కుమార్ మిశ్రా ఈ విషయాన్నీ ట్వీట్ చేయడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.
''నా దేశం ఎంతో గొప్పది. ఓ బాలికకు అత్యవసరంగా రక్తం అవసరమైంది. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఆమె వేరొకరి బిడ్డ. కానీ.. ఆ వధవరులు అలా భావించలేదు. రక్తదానం చేసి ఆ బాలిక ప్రాణాలు కాపాడారు'' అని ఆశిష్ కుమార్ మిశ్రా తన ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా ఈ ట్వీట్ లో వరుడు రక్తదానం చేస్తుంటే వధువు పక్కనే నిలుచుని ఉంది. ఈ న్యూస్ వైరల్ కావడంతో నెటిజన్లు వారిని అభినందిస్తూ హాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
मेरा भारत महान |
— Ashish Kr Mishra (@IndianCopAshish) February 22, 2021
एक बच्ची को ब्लड की जरूरत थी,कोई भी रक्तदान करने को सामने नही आ रहा था, क्योंकि वो किसी दूसरे की बच्ची थी,अपनी होती तो शायद कर भी देते,
खैर, शादी के दिन ही इस जोड़े ने रक्तदान कर बच्ची की जान बचायी |
Jai Hind,#PoliceMitra #UpPoliceMitra #BloodDonation pic.twitter.com/tXctaRe1nR
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com