Viral News: ఇన్నోవేటివ్ ఎడ్ల బండి.. విద్యార్థి వినూత్న ప్రయత్నం..

Viral News: ఇన్నోవేటివ్ ఎడ్ల బండి.. విద్యార్థి వినూత్న ప్రయత్నం..
Viral News: ఆదిలాబాద్ జిల్లా పిప్పర వాడ గ్రామ విద్యార్థి ఒక వినూత్నమైన ఇన్నోవేషన్ చేశారు.

Viral News: ఈ జెనరేషన్ వారికి సోషల్ మీడియాతో టైమ్ పాస్ చేయడం మాత్రమే తెలుసు. సమయం వృథా చేయడం వారికి బాగా అలవాటు. చదువుల మీద అసలు వారికి శ్రద్ధే లేదు. ఇవన్నీ ఈ జెనరేషన్ వారి గురించి మనం తరచుగా వినే మాటలే. కానీ వారే కానీ మనసు పెడితే ఎన్నో అద్భుతాలను సృష్టించగలరు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఓ విద్యార్థి తయారు చేసిన మోడర్న్ ఎడ్ల బండిని చూస్తే ఈ విషయం మరోసారి ప్రూవ్ అవుతోంది.

ఆదిలాబాద్ జిల్లా పిప్పర వాడ గ్రామ విద్యార్థి ఒక వినూత్నమైన ఇన్నోవేషన్ చేశారు. తద్వారా ఎడ్ల వెన్నుపాముపై భారం తగ్గించి సులభంగా బండి కదలడానికి ఆలోచన చేశాడు. రెండు ఎడ్ల మెడభాగంపై ఓ కర్రను పెట్టి.. దానికి ఓ చక్రాన్ని అమర్చాడు. దీంతో ఆ ఎడ్లపై అధిక బరువు పడదు.


మామూలుగా వ్యవసాయం కోసం, ఇంకా ఇతరేతర అవసరాల కోసం మూగజీవాలను ఉపయోగించడం మనుషులకు అలవాటే. కానీ కొన్నిసార్లు దాని వల్ల ఆ మూగజీవాలపై ఒత్తిడి పడుతుంది. ఈ ఇన్నోవేటివ్ ఎడ్ల బండి వల్ల ఎడ్లపై అధిక బరువు భారం పడదు. అలాగే పనులు కూడా సాఫీగా సాగిపోతాయి. అందుకే ఈ ఎడ్ల బండిని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story