Barbie: మీకు బార్బీ బొమ్మగా మారాలని ఉందా..? సర్జరీ ఖర్చులు ఎంతంటే..

Barbie: మీకు బార్బీ బొమ్మగా మారాలని ఉందా..? సర్జరీ ఖర్చులు ఎంతంటే..
దీనికి ఏకంగా రూ.98,53,950 ఖర్చు అవుతోంది.

ప్రపంచవ్యాప్తం బార్బీ(Barbie) బొమ్మలకు ఉన్న డిమాండ్, వాటిని ఇష్టపడే వారు కోట్లల్లో ఉంటారు. బార్బీపై హాలివుడ్ నటి మార్గట్ రాబీ(Margot Robbie) నటిస్తున్న 'బార్బీ(Barbie)' అనే సినిమా కూడా జులై 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఒక వైద్యుడు బార్బీగా మారాలనుకునే వారిని బార్బీ బొమ్మలుగా అందంగా మారుస్తానని అంటున్నాడు. దీనికి ఏకంగా రూ.98,53,950 ఖర్చు అవుతోంది. డా. స్కాట్ బ్లయర్ అనే వైద్యుడు 3 రకాలైన, ముఖ మార్పిడి లేదా ముఖ సర్జరీ, పింక్ కలర్‌ గోళ్లతో పాటుగా బార్బీ లాంటి వెంట్రుకలు, పళ్ల తెలుపుదనం(టీత్ వైట్‌నింగ్) వంటి సర్జరీలతో పూర్తిగా బార్బీగా మారే సర్జరీలు నిర్వహిస్తున్నాడు.


పురుషులను కూడా కెన్ డాల్స్‌గా మార్చేలా సర్జరీ చేయగలడు. దీనికి రూ.89,34,238 అవుతోందని వెల్లడిస్తున్నాడు. సర్జరీ ధరలు ఇంత భారీ మొత్తంలో ఉన్నప్పటికీ ఇప్పటికే చాలా మంది మహిళలు తనను సంప్రదించినట్లు వెల్లడించాడు.

"ఈ కాలంలో అమ్మాయిలు బార్బీ బొమ్మలాగా అందంగా మారాలని ఎవరు కోరుకోరు. నువ్వు అచ్చం బార్బీలాగా ఉన్నావు అనే ప్రశంస కంటే ఉత్తమమైంది లేదు. అందంగా ఉండటం వల్ల జీవితంలో మనకు ఇంకాస్త ఎక్కువ ఆనందం లభిస్తుంది. నాకు బార్బీలాగా ఉండాలనే నా కోరిక ఇప్పుడు తీరబోతుంది" అని సర్జరీ చేయించుకోబోతున్న 29 యేళ్ల యువతి వెల్లడించింది.


బార్బీలాగా మారడం వల్ల నన్ను నేను తెల్సుకోగలిగేలా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని మరో యువతి అభిప్రాయం వ్యక్తం చేసింది.

సర్జరీకి వచ్చే పేషెంట్ల కోసం పింక్ కలర్‌లో ఉండే ఓడల ద్వారా వారిని సర్జరీకి తీసుకువచ్చి, అందులోనే విడిచిపెట్టే సర్వీస్‌లు కూడా రన్ చేస్తున్నాడు. మగ వారు పింక్ కలర్ కాకుండా వేరే కలర్ల ఓడలను ఎంపికచేసుకునే సదుపాయం కల్పిస్తున్నాడు.




Tags

Read MoreRead Less
Next Story