Karimnagar : కరీంనగర్‌లో పుష్ప విలన్.. వైరల్ గా మారిన ఫోటో...!
Karimnagar : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. గతేడాది డిసెంబర్‌లో పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అయితే ఈ సినిమాలో భన్వార్ సింగ్ షేఖావత్‌గా నటించి అదరగొట్టాడు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్.. ఈ సినిమాలో గుండుతో కనిపిస్తాడు ఫాసిల్.
అయితే భన్వార్ సింగ్ షేఖావత్ లాగే కరీంనగర్‌లో ఓ ట్రాఫిక్ పొలీస్ ఉండడం, అందరు అతన్ని ఫాసిల్ అనుకోని ఆయన దగ్గరికి వెళ్లి సెల్ఫీ లకు పోటీ పడుతున్నారు.. ఇంతకీ ఆయన ఎవరంటే... పేరు శ్రీనివాస్.. అందరు ముద్దుగా ఆయన్ని బుల్లెట్ శ్రీను అని పిలుస్తుంటారు.. ఈయనకి సినిమాలంటే మహా పిచ్చి.. ఏదైనా సినిమా చూశాడంటే అందులోని హీరోల హెయిర్ స్టైల్ మెయింటేన్ చేస్తాడు.
అయితే పుష్ప సినిమాలో ఫహద్ ఫాసిల్ గుండుతో కనిపించడం మనోడికి బాగా నచ్చింది. ఇంకేముంది అలాగే రెడీ అయిపోయాడు.. చూడడానికి పుష్పలో భన్వార్ సింగ్ షేఖావత్ లాగే ఉండడంతో అందరు అతనితో సేల్ఫీలు దిగుతున్నారు.. అయితే ఇలా వారు తనతో ఫోటోలు దిగడం చాలా ఆనందంగా ఉందని శ్రీను అంటున్నాడు. కాగా పుష్ప పార్ట్ టూ లో ఫహద్ ఫాసిల్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com