పిల్లి తప్పిపోయింది.. రివార్డు ప్రకటించిన మహిళ..!

పిల్లి తప్పిపోయింది.. రివార్డు ప్రకటించిన మహిళ..!
సహజంగా కుటుంబ సభ్యులో, తెలిసినవాళ్లో కనిపించకుండ పోతే హైరాన పడతాం. ఆందోళనతో కనిపించినచోట్ల వెతుకుతాం.

సహజంగా కుటుంబ సభ్యులో, తెలిసినవాళ్లో కనిపించకుండ పోతే హైరాన పడతాం. ఆందోళనతో కనిపించినచోట్ల వెతుకుతాం, ఇతరులకు వాకబు చేసినా..ఫలితం కనిపించకుంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం. కానీ ఇందుకు భిన్నంగా ప్రాణానికి ప్రాణం పెంచుకున్న పిల్లి తప్పిపోయిందంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవటంతో పెంచుకున్న పిల్లి ఆచూకీ కోసం ఏకంగా రూ. 30 వేల రివార్డు ప్రకటించి అందర్ని ఆశ్చర్యపర్చింది జంతు ప్రేమికురాలు.

హైదరాబాద్ టోలిచౌకిలో ఉండే సెరీనా జంతుప్రేమికురాలు. చిన్ననాటి నుంచే ఇంట్లో పలు రకాల జంతువులను పెంచుతోంది. 8 నెలల కిందట అప్పుడే పుట్టిన పిల్లిని దత్తత తీసుకుంది. దానికి జింజర్‌ అని పేరు పెట్టింది సాకుతోంది. ప్రేమగా పెంచుకుంటున్న పిల్లికి...కరోనా పరిస్థితుల దృష్ట్యా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్‌ కోసం జూబ్లీహిల్స్‌లోని పెట్‌ క్లీనిక్‌కు వెళ్లింది సెరీనా. గత నెల 17 జింజర్‌ పిల్లికి సర్జరీ చేయించింది. కుట్లు వేసిన చోట స్వెల్లింగ్ రావటంతో...తిరిగి జూన్‌ 23న ఆస్పత్రికి తీసుకెళ్లింది.

చికిత్స జరుగుతుండగానే జూన్ 24న జింజర్‌ పిల్లి తప్పిపోయిందంటూ ఆస్పత్రి సిబ్బంది సెరీనాకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడిన ఈ జంతు ప్రేమికురాలు...రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయకపోవటంతో...జూబ్లీహిల్స్ పరిసరాల్లో వెతికినా ఫలితం కనిపించలేదని మహిళ కన్నీరు పెట్టుకుంది. తప్పిపోయిన తన పిల్లి గురించి మీడియాతో తన బాధను పంచుకుంది సెరీనా. 20 రోజులుగా వెతుకుతున్నా ఫలితం లేకపోవటంతో పిల్లి ఆచూకీ తెలిపినవారికి రూ. 30వేలు రివార్డు ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story