కరిచిన పాముతో ఆసుపత్రికి.. గుంటూరులో యువకుడు హల్‌చల్‌..!

కరిచిన పాముతో ఆసుపత్రికి.. గుంటూరులో యువకుడు హల్‌చల్‌..!
గుంటూరు జిల్లా నందివెలుగు గ్రామంలో ఓ యువకుడు పాముతో హల్‌చల్‌ చేశాడు. తనను కరిచిన త్రాచుపాముతో వీరాంజనేయులు అనే యువకుడు ఆసుపత్రికి వెళ్లాడు .

గుంటూరు జిల్లా నందివెలుగు గ్రామంలో ఓ యువకుడు పాముతో హల్‌చల్‌ చేశాడు. తనను కరిచిన త్రాచుపాముతో వీరాంజనేయులు అనే యువకుడు ఆసుపత్రికి వెళ్లాడు . దీంతో ఆసుపత్రిలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. సదరు యువకుడిని పామును ఎందుకు తీసుకొచ్చావని అడగగా.. ఏపాము కరిచిందని వైద్యులు అడుగుతారని ..అందుకే పామును డబ్బాలో పెట్టి తీసుకొచ్చానని చెప్పాడు. వైద్యం పూర్తయిన తర్వాత జనసంచారం లేని ప్రాంతంలో పామును వదిలేస్తానని తెలిపాడు. ప్రస్తుతం వీరాంజనేయులు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు వైద్యులు.

Tags

Read MoreRead Less
Next Story