Aadhar Wedding Card: ఆధార్ కార్డ్ కాదు.. వెడ్డింగ్ కార్డ్.. క్రియేటివిటీ అదిరిందిగా..!

Aadhar Wedding Card: ఇటీవల కాలంలో ఏ చిన్న విషయాన్ని అయినా క్రియేటివ్‌గా చేయాలనే ప్రయత్నిస్తున్నారు అందరు. ముఖ్యంగా పెళ్లి విషయంలో అయితే ఎవరూ ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. వెడ్డింగ్ ఇన్విటేషన్ దగ్గర నుండి రిసెప్షన్ వరకు అన్ని డిఫరెంట్‌గానే ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఓ జంట.. తమ వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను చాలా కొత్తగా డిజైన్ చేసుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు.
ఛత్తీస్‌ఘడ్‌లోని జష్‌పూర్‌పూర్‌కు చెందిన లోహిత్ సింగ్ తన పెళ్లి కార్డును చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేసుకోవాలి అనుకున్నాడు. అందులో భాగంగానే తనకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాను అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేశాడు. అంతే.. ఆ వెడ్డింగ్ కార్డ్ చూసినవారంతా ఫిదా అయిపోతున్నారు.
లోహిత్ సింగ్ వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను ఆధార్ స్టైల్‌లో తయారు చేయించాడు. మొదటిసారి చూడగానే ఇది నిజంగానే ఆధార్ కార్డ్ ఏమో అన్న అనుమానం కూడా కలిగే అంత పర్ఫెక్ట్‌గా ఉంది ఇన్విటేషన్. పైగా లోహిత్ సింగ్ తన చుట్టుపక్కల గ్రామాలకు ఒరిజినల్, డూప్లికేట్ ఆధార్ కార్డులను తయారు చేస్తుంటాడు. తనకు ఈ డిఫరెంట్ ఐడియా రావడానికి ఇది కూడా ఒక కారణం. అయితే ఈ ఆధార్ కార్డ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ బయట పంచడానికి కాదని, కేవలం ఆన్‌లైన్‌లోనే పంపవచ్చని అతడు స్పష్టం చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com