చైనా అధ్యక్షుడితో చర్చలు జరిపా.. మ్యాటరేంటంటే..: బ్రహ్మాజీ

చైనా అధ్యక్షుడితో చర్చలు జరిపా.. మ్యాటరేంటంటే..: బ్రహ్మాజీ
ఎలక్షన్ల గురించి చర్చించాం. ఆయన కొన్ని కొత్త టిప్స్ చెప్పారు.

ఓ చిన్న వైరస్‌తో ప్రపంచాన్ని గడగడలాడించిన చైనాతో చర్చలు జరపడమే బెటర్ అనుకున్నట్టున్నారు బ్రహ్మాజీ. లేకపోతే 'మా' గొడవలు పరిష్కారం కావనుకున్నారేమో. అందుకే ఆయనకి వచ్చిన ఆలోచనతో ఫన్నీగా ఓ పోస్ట్ పెట్టారు. కరోనా గిరోనా జాన్తా నై అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేయందించినా.. బుద్దిగా మాస్క్ పెట్టుకుని రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతున్నారు బ్రహ్మాజీ.

సార్.. మేమిద్దరం సాధారణంగానే కలిశాం. ఇందులో ఎటువంటి రాజకీయాల్లేవు. కాకపోతే 'మా' ఎలక్షన్ల గురించి చర్చించాం. ఆయన కొన్ని కొత్త టిప్స్ చెప్పారు. అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి కొన్ని హాస్య ఎమోజీలు పెట్టారు. ఈ ఫన్నీ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.

Tags

Next Story