Pragathi Dance : నాగిని సాంగ్‌కి ప్రగతి ఊరమాస్ స్టెప్పులు..వీడియో వైరల్

Pragathi Dance : టాలీవుడ్‌లో అమ్మ, పిన్ని, అత్త పాత్రలంటే టక్కున గుర్తుకొచ్చే నటుల్లో ప్రగతి ఒకరు.. సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ గానే ఉంటారు. ఫిట్నెస్‌కి సంబంధించిన వర్కౌట్ వీడియోలతో పాటుగా డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా ఆమె నాగిని సాంగ్‌కి స్టెప్పులేసింది. జిమ్ కోసం వెళ్ళిన ప్రగతి అక్కడ 'నాగిని'సాంగ్‌కి ఊరమాస్ స్టెప్పులేసి అందరిని అలరించింది. ఈ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ... 'నేను చేసే ప్రతి పనిలో ఆనందాన్ని సృష్టిస్తాను'అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రగతి ఎఫ్3లో నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com