Aghori : శవయాత్రలో అఘోరీ హల్చల్.. బందోబస్తు మధ్య ఆలయాల సందర్శన

Aghori : శవయాత్రలో అఘోరీ హల్చల్.. బందోబస్తు మధ్య ఆలయాల సందర్శన
X

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవక్షేత్రాలను దర్శిస్తున్నారు అఘోరీ నాగసాధు. కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మ ప్రచారానికై తిరుగుతున్న అఘోరీ.. వార్తల్లో నిలుస్తున్నారు. రాయలసీమలోని ఆలయాల్లో దర్శనం చేసుకున్న అఘోరీ...ఆ తర్వాత విజయవాడతో పాటు ఉత్తరాంధ్రలోని ప్రముఖ ఆలయాల్లో సందర్శిస్తున్నారు. కోటప్ప కొండలోని శైవక్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత భీమవరం వెళ్తూ ఓ శవయాత్రలో హల్చల్ చేశారు. శవం చెవిలో ప్రార్థించి.. ఆత్మ శాంతి పూజ చేసి సాగనంపారు. ఏపీ పర్యటనలో అఘోరీకి ప్రత్యేక సెక్యూరిటీ కల్పిస్తున్నారు పోలీసులు. శ్రీకాళహస్తిలో పెట్రోల్ పోసుకుని హల్చల్ చేసిన అఘోరీని జాగ్రత్తగా క్షేత్రాలు దాటిస్తున్నారు పోలీసులు. ఆలయాల్లో స్పెషల్ గా పూజలు చేసుకునేందుకు వసతులు కల్పిస్తున్నారు.

Tags

Next Story