Viral News: అయ్యో నా బ్యాగ్ ఇలా అయిందేమిటి.. లబో దిబోమన్న విమాన ప్రయాణీకుడు

Viral News: ఎక్కే ముందు బానే ఉంది.. దిగి చూసుకునేసరికి ఇలా అయిపోయిందేమిటని విమాన ప్రయాణికుడు బ్యాగు అవతారం చూసి లబోదిబో మన్నాడు.. ఇంకా నయం విలువైన వస్తువుల ఏమైనా పెట్టుంటే ఏమయ్యేది అని కాస్త ఊరట పడ్డాడు.. ఏవిటో ఎంత పెద్ద ఫ్లైట్ అయినా ఎక్కేముందు మన దగ్గర లగేజీ వుంచరు. ఎక్కడో పెడతారు. దిగిన తరువాత మళ్లీ దానికోసం వేచి వుండాలి.
తాజాగా ఓ విమాన ప్రయాణికుడికి ఓ వింత అనుభవం ఎదురైంది. ఫ్లైట్ దిగాక లగేజీ ఎస్కలేటర్ వద్దకు వెళ్లాడు తన బ్యాగ్ తీసుకుందామని. బ్యాగ్ ఉంది కానీ దాని రూపు రేఖలు మొత్తం మారిపోయాయి. ఏ మాత్రం ఉపయోగించడానికి వీలు లేకుండా తుక్కుతుక్కు అయింది. యాక్సిడెంట్ అయిన కారు మాదిరిగా. ఇంత ఘోరంగా ఉంది ఇది తన బ్యాగేనా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాడు. తనదే అని నిర్ధారించుకున్నాక.. ఇదీ నా బ్యాగ్ పరిస్థితి అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com