Akhil Fan : 'అయ్యగారే నెంబర్ 1'.. హార్ట్ కోర్ ఫ్యాన్‌‌కి అఖిల్ బంపర్ ఆఫర్..!

Akhil Fan : అయ్యగారే నెంబర్  1.. హార్ట్ కోర్ ఫ్యాన్‌‌కి అఖిల్ బంపర్ ఆఫర్..!
Akhil Fan : తమ అభిమాన నటుడి పైన అభిమానులు ఒక్కోరకంగా అభిమానం చూపిస్తుంటారు. దీనికి కొలతలు, హద్దులు అంటూ ఏవీ లేవు..

Akhil Fan : తమ అభిమాన నటుడి పైన అభిమానులు ఒక్కోరకంగా అభిమానం చూపిస్తుంటారు. దీనికి కొలతలు, హద్దులు అంటూ ఏవీ లేవు.. ఇక్కడో అభిమాని కూడా అంతే... తన అభిమాన హీరో సినిమా వస్తే చాలు.. మైక్ ముందుకు వచ్చి పూనకంతో ఊగిపోతాడు. తన హీరోనే నెంబర్ వన్ అంటుంటాడు.. ఇంతకీ అతనికి అంతలా కనెక్ట్ అయిన హీరో ఎవరా అనుకుంటున్నారా.. అక్కినేని అఖిల్.. అవును.. అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమా వస్తే చాలు థియేటర్ల వద్ద తెగ సందడి చేస్తాడు.

అందులోనూ అఖిల్ సినిమా అయితే ఆ రచ్చ ఇంకోలా ఉంటుంది. అఖిల్ సినిమాల విడుదల సమయంలో ఉత్సాహంతో ఊగిపోతూ.. 'అయ్యగారే కరెక్టు.. అఖిల్‌ అయ్యగారే రావాలి' అంటూ తన ప్రేమని చూపిస్తాడు. అప్పట్లో అయ్యగారే నెంబర్ వన్ అంటూ సోషల్‌ మీడియాలో ఫేమస్ అయ్యాడు ఈయన. అప్పట్లో ఈ వీడియో కూడా బాగానే వైరల్ అయింది.


తాజాగా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ సినిమా రిలీజ్‌ సందర్భంగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇది కాస్త అఖిల్ దాకా వెళ్ళింది. అతని అభిమానానికి ముగ్ధుడైన హీరో అఖిల్.. తనని తప్పకుండా కలుస్తానని తాజాగా వెల్లడించాడు అఖిల్. తన అభిమాని తన కంటే కూడా ఎక్కువ పాపులర్‌ అయ్యాడని, దీనికి ఎంతో సంతోషంగా ఉందని అఖిల్ అన్నాడు.

ఇదిలా ఉంటే అయ్యగారు అని గూగుల్ లో సెర్చ్ చేస్తే ఇతనే ఫోటోనే రావడం విశేషం..!

Tags

Read MoreRead Less
Next Story