MSinger Pravasthi : పాడుతా తీయగా.. పోరాడు ధైర్యంగా

MSinger Pravasthi :  పాడుతా తీయగా.. పోరాడు ధైర్యంగా
X

పాడుతా తీయగా.. తెలుగు వారికి అత్యంత ఇష్టమైన పాట. ఈ పాటనే టైటిల్ గా పెట్టి 23యేళ్లకు పైగా తెలుగులో ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో కొత్త గాయనీ గాయకులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదలుపెట్టిన ఈ షో మధ్యలో కొన్నాళ్లు ఆయన లేకుండా సాగినా.. తర్వాత ఆయన చివరి శ్వాస వరకూ ఆయనే ప్రధానంగా కనిపిస్తూ.. ఆయన వ్యాఖ్యానం, విశ్లేషణలు, వివరణలు, విశేషాలతో ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూనే.. ఎంతోమంది కొత్త గాయనీ గాయకులను తెలుగు తెరకు, తెలుగు వారికి అందించారు. ఇన్నేళ్లలో ఎన్నడూ.. ఈ షో పై ఎలాంటి వివాదాలూ రాలేదు. మొదటిసారిగా గాయని ప్రవస్థి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. మామూలు షోస్ విషయంలోనే రచ్చ రచ్చ కనిపిస్తుంది. అలాంటిది ఇలాంటి హై క్రెడిబిలిటీ ఉన్న షో పై ఆరోపణలు రావడం.. అది కూడా కీరవాణి, చంద్రబోస్, సునిత వంటి వారు జడ్జెస్ గా ఉండగా.. వారిపైనే ఆరోపణలు రావడం సంచలనమే కదా.

స్వస్థిక చెప్పింది వింటే.. ఈ షో మొత్తంలో జడ్జెస్ పూర్తిగా తనను టార్గెట్ చేశారు అంటోంది. తన పాటలో తప్పులు లేకపోయినా కావాలనే టాప్ పిచ్ లో పాడలేదని చెప్పారు. కానీ లిరిక్స్ మర్చిపోయిన వాళ్లను గురించి మాత్రం అసలు మాట్లాడలేదని చెప్పింది. సింగర్ సునిత ప్రతిసారీ నన్ను టార్గెట్ చేసింది. తను గతంలో తన కుటుంబ పరిస్థితులు చెప్పింది. ఆ కారణంగా కొన్ని ఈవెంట్స్ లో తను పాటలు పాడేందుకు వెళ్లిందట. అయితే కీరవాణి తనకు పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్ లో పాటలు పాడేవాళ్లంటే అసహ్యం అని తననే చూస్తూ అన్నాడని.. నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన వారిని తన టీమ్ లో తీసుకుంటా అన్నాడని, అదే సందర్భంలో తన ఇంటి వద్ద కొత్త సింగర్స్ ‘చాకిరీ’ చేస్తుంటారనీ.. మీరు కూడా చేయాల్సి ఉంటుందన్నాడని ఆరోపించింది. అలాగే కేవలం కీరవాణికి శివరంజని రాగం అంటే ఇష్టం ఉండదు అని ఆ రాగంలో కంపోజ్ చేసిన పాటలు పాడించేవారు కాదని విచిత్రమైన కంప్లైంట్ చేసింది. అలాగే ఒకప్పటిలా నించుని పాడితే కుదరదని, సింగర్స్ తో డ్యాన్సులు వేయించారనీ, ఒక సారి చీరలు ఇచ్చిన బొడ్డు కిందకు కట్టుకోవాలని, కాస్త ఎక్స్ పోజింగ్ కూడా చేయాలని చెప్పారని పెద్ద ఆరోపణ చేసింది స్వస్థిక. తను ఎలిమినేట్ కావడమే టార్గెట్ గా సునిత వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసిందని చెబుతూ.. ఈ షో గురించిన ఇలాంటి విషయాలు చెప్పకుండా ఆపాలని చాలామంది ప్రయత్నించారని కానీ నేను ఇక సింగింగ్ ను వదిలేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టే.. ఇకపై ఇలాంటి షోస్ ను చూడటం ఆపేయాలని, స్పాన్సర్స్ కూడా స్పాన్సర్స్ చేయొద్దని.. నాలా చాలామంది సఫర్ అయ్యారని, వారి తరఫున కూడా నేను మాట్లాడుతున్నా అంటూ జడ్జెస్ వల్ల ఈ షో భ్రష్టు పట్టింది అన్న ధోరణిలో మాట్లాడింది. అలాగే తనకు, తన కుటుంబానికి ఏమైనా జరిగితే, కీరవాణి, సునిత, చంద్రబోస్ తో పాటు జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్లదే బాధ్యత అంటూ చెప్పింది.

స్వస్థిక చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ ఆరోపణలపై షో డైరెక్టర్స్ లేదా జడ్జెస్ ఎవరైనా స్పందిస్తారా అనేది చూడాలి.

Tags

Next Story