Ambani Engagement: 10ని. ప్రదర్శనకు కోటిన్నర; సింగర్ జాక్ పాట్

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. రాధికా మర్చంట్‌తో జరిగిన ఈ నిశ్చితార్ధ వేడుకను అంబానీ ఫ్యామిలీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. రాజస్థాన్‌లోని నట్ ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా జరిగింది.
ఈ వేడుకలో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ను దీవించేందుకు పలువురు ప్రముఖులతో పాటు, రణబీర్ కపూర్- అలియా భట్, రణ్ వీర్ సింగ్, జాన్వీ కపూర్ హాజరయ్యారు. ఇక ఈ నిశ్చితార్థ వేడుకలకు విచ్చేసిన అతిథులకు వినోదాన్ని పంచేందుకు పాప్ సింగర్ మికా సింగ్ షో ఆర్గనైజ్ చేశారు. ఇతని ప్రదర్శనను చూసిన అతిథులు మికా పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఫుల్ ఖుషీ అయిన అంబానీ అతని పాటకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చాడట.
ఈ స్టార్-స్టడెడ్ బాష్ లో మికా సింగ్ ప్రదర్శనకు మంత్రముగ్ధులైన అంబానీ కుటుంబం డాన్స్ లు సైతం చేశారు. ఇక మికా సింగ్ కు భారీమొత్తంలో పారితోషకం ముట్టజెప్పారని అర్ధమవుతోంది. కేవలం 10 నిమిషాలు పాడిన పాటకు రూ. 1.5 కోట్లు బహుకరించారట అంబానీ. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇక కొన్ని నెలల్లో జరిగబోయే వీరి వివాహ తేదీని త్వరలోనే అంబానీ ఫ్యామిలీ అనౌన్స్ చేయనన్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com