Karnataka: ఘోర ప్రమాదానికి గురైన అంబులెన్స్.. రోగితో సహా నలుగురు మృతి..

Karnataka: ఘోర ప్రమాదానికి గురైన అంబులెన్స్.. రోగితో సహా నలుగురు మృతి..
Karnataka: కర్ణాటకలో ఓ అంబులెన్స్ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చిన తర్వాత రోడ్డు తడిగా ఉండడంతో టైర్లు స్కిడ్ అయ్యాయి.

Karnataka: భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వర్షాల వల్ల వరదలు ఏర్పడి వాటిలో చిక్కుకుపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అంతే కాకుండా ఎన్నో రోడ్డు ప్రమాదాలకు కూడా ఈ వర్షాలే కారణమయ్యాయి. తాజాగా కర్ణాటకలోని ఓ అంబులెన్స్ కూడా వీటి కారణంగానే ఘోర ప్రమాదానికి గురైంది. భయం కలిగించే ఈ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఓ అంబులెన్స్ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చిన తర్వాత రోడ్డు తడిగా ఉండడంతో టైర్లు స్కిడ్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా అంబులెన్స్ రూటు మార్చి టోల్ భూత్ క్యాబిన్‌ను ఢీ కొట్టింది. దీంతో అందులో ఉన్న రోగితో పాటు ఇతరులు కూడా బయటికి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్నవారంతా మరణించినట్టుగా సమాచారం.


Tags

Next Story