హ్యాట్సాఫ్ : 70 ఏళ్ల వయసులో ఎవరిపై ఆధారపడకుండా..

హ్యాట్సాఫ్ : 70 ఏళ్ల వయసులో ఎవరిపై ఆధారపడకుండా..
వారిద్దరూ వృద్ద దంపతులు... కృష్ణారామా అంటూ ఓ మూలాన కూర్చోలేదు.. ఖాళీగా కూర్చోవడం వారికీ నచ్చలేదు.. రోడ్డుపక్కన ఓ తినుబండారాల దుకాణం ఏర్పాటు చేసుకున్నారు.

వారిద్దరూ వృద్ద దంపతులు... కృష్ణారామా అంటూ ఓ మూలాన కూర్చోలేదు.. ఖాళీగా కూర్చోవడం వారికీ నచ్చలేదు.. రోడ్డుపక్కన ఓ తినుబండారాల దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డుపక్కన స్పెషల్ నాస్తా తర్రి పోహా అని అమ్ముతూ పొద్దుననుంచి రాత్రివరకు కష్టపడుతున్నారు. ఎవరి పై ఆధారపడకుండా బ్రతుకుతున్నారు. కేవలం పదిరూపాయలకి రుచికరమైన పోహాను అమ్ముతున్నారు. వీరి స్టోరీని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వీరి కష్టం అందరికీ తెలిసింది. కాగా ఈ వృద్ద దంపతులు మహారాష్ట్రలోని నాగపూర్ లో జీవిస్తున్నారు. ఈ జంట నాలుగేళ్ల క్రితం నుంచి ఇలా రోడ్డుపక్కన తర్రి పోహా అని అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు లేచి తండాపేట్ లోని పండిట్ నెహ్రూ కాన్వెంట్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ తర్రి పోహాను తయారిచేసి విక్రయిస్తుంటారు. నెటిజన్లు వీరిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆ జంటకు అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.వారి పట్ల గౌరవం చూపిస్తున్నారు. రియల్లీ.. మీరు చాలా గ్రేట్ అని కితాబిస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story