వైరల్

Viral Video: భలే ఉన్నారు గున్న ఏనుగు బాడీగార్డులు.. వీడియో వైరల్

Viral Video: బాడీ గార్డులంటే బలిష్టంగా ఉండాలి.. అప్పుడే అటువైపు లుక్కేయడానిక్కూడా ఎవరూ సాహసించరు.. మనుషులకే ఈ భద్రత అనుకుంటే పొరపాటు..

Viral Video: భలే ఉన్నారు గున్న ఏనుగు బాడీగార్డులు.. వీడియో వైరల్
X

Viral Video: బాడీ గార్డులంటే బలిష్టంగా ఉండాలి.. అప్పుడే అటువైపు లుక్కేయడానిక్కూడా ఎవరూ సాహసించరు.. మనుషులకే ఈ భద్రత అనుకుంటే పొరపాటు.. గున్న ఏనుగుకు కూడా భద్రత కల్పిస్తున్నాయి ఈ భారీ గజరాజులు.. అప్పుడే పుట్టిన తమ చిన్నారిని జాగ్రత్తగా తీసుకువెళుతున్నాయి.. ఎవరికన్నూ పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాయి.. గున్న ఏనుగుకు జడ్ +++ భద్రత కల్పిస్తున్నాయని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో షేర్ చేశారు.. 38 సెకన్లు ఉన్న ఈ సరదా వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏనుగుల గుంపు రోడ్డు గుండా వెళుతున్నప్పుడు పిల్ల ఏనుగును తీసుకువెళుతున్నట్లు చూపిస్తుంది. "అందమైన నవజాత శిశువుకు ఏనుగు గుంపు కంటే మెరుగైన భద్రతను భూమిపై ఏ జీవి అందించదు. ఇది Z+++ భద్రత. సత్యమంగళం కోయంబత్తూరు రోడ్డుపై కనిపించిన దృశ్యం ఇది అని Mr నందా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వెంటనే వైరల్ అయ్యింది. ఇప్పటివరకు దాదాపు 1,500 రీట్వీట్‌లు, 9,000 లైక్‌లు సొంతం చేసుకుంది. ఈ దృశ్యం చాలా అందంగా ఉంది. ఏనుగులు చాలా బలమైన బంధాన్నికలిగి ఉంటాయి, మందలోని ప్రతి ఆడ ఏనుగు అన్ని గున్న ఏనుగులకు తల్లిగా ఉంటుంది. అవి తమ చిన్నారులను చాలా జాగ్రత్తగా సంరక్షిస్తాయి. ఈ వీడియో మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది అని ఒక నెటిజన్ రాసుకొచ్చారు.

Next Story

RELATED STORIES