Saree Styling: ఈ కుర్రాడు కట్టినట్టుగా చీర కడితే అబ్బాయిలకు స్టైలిష్ లుక్..

Saree Styling: ఆరు గజాల అందమైన చీరను సెలక్ట్ చేయడమే రాదంటారు అబ్బాయిలకు.

Saree Styling: ఆరు గజాల అందమైన చీరను సెలక్ట్ చేయడమే రాదంటారు అబ్బాయిలకు. అలాంటిది చీరను అందంగా కట్టుకోవడమే కాదు ఫ్యాషన్‌గా మార్చి దానికి ట్రెండీ లుక్ ఇచ్చి ఆ లుక్‌ను వైరల్ చేయడం కూడా ఇప్పుడు అబ్బాయిలకు తెలుసు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాలపై ఓ క్లిక్ ఇస్తే అబ్బాయిలు ఫీల్ అవుతున్న కిక్ ఏంటో మీకు తెలుస్తుంది. మగవారు చీర కట్టుకోవడం ఏంట్రా బాబు అని మీకు అనిపించొచ్చు కానీ ఈ కుర్రాడు కట్టిన చీరకట్టును చూసి మీరైతే మాత్రం వావ్ అనకుండా ఉండలేరు.

ఈరోజుల్లో చాలామంది అమ్మాయిలకు చీర కట్టుకోవడం రావట్లేదు. అది నేర్పించడానికే టెక్నాలజీ ఎన్నో సౌకర్యాలను కల్పించింది. యూట్యూబ్ లాంటి వాటిలో ఎన్నో వీడియోలు కూడా ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో నెంబర్ 1గా వెలిగిపోతున్న ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా చీర ఎలా కట్టుకోవాలో నేర్పిస్తున్నారు కొందరు. కానీ ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రం చీరను అబ్బాయిలు కూడా ఎలా కట్టుకోవచ్చో, దానిని కూడా ఎలా ఫ్యాషన్‌గా మార్చవచ్చో చూపిస్తున్నాడు.

చీర ఒక్కటే అయినా.. ఈ చీర కట్టుకునే విధానాలు మాత్రం ఎన్నో. ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కలాగా చీరలు కట్టుకుంటూ ఉంటారు. అందుకే ఈ కుర్రాడు కూడా అలాంటి స్టైల్స్‌లో రెండింటిని చేసి చూపించాడు. తన ఐడియాలు చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఒక చీరను పంచె లాగా, పటియాలా లాగా ఎలా కట్టుకోవాలో నేర్పిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు లక్షల్లో లైకులు వచ్చేస్తున్నాయి. ఈమధ్య అబ్బాయిలు కుర్తాలపై మామూలు ప్యాంట్లు కాకుండా పంచెలు కట్టుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఒక చీరనే పంచెలా ఎలా కట్టుకోవాలో మనోడు చూపిస్తున్న స్టైలే వేరబ్బా..

Tags

Next Story