Six-Seater EV bike: ఆనంద్ మహీంద్రా మెచ్చిన దేశీ సిక్స్-సీటర్ ఈవీ బైక్..

Six-Seater EV bike: ఆనంద్ మహీంద్రా మెచ్చిన దేశీ సిక్స్-సీటర్ ఈవీ బైక్..
Six-Seater EV bike: తమలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి చదువుతో పనిలేదని నిరూపిస్తున్నారు కొందరు గ్రామీణ యువతీ యువకులు. అలాంటి వారిని ఇన్‌స్పిరేషన్‌గా చూపిస్తుంటారు ఆనంద్ మహేంద్రా.

Six-Seater EV bike: తమలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి చదువుతో పనిలేదని నిరూపిస్తున్నారు కొందరు గ్రామీణ యువతీ యువకులు. అలాంటి వారిని ఇన్‌స్పిరేషన్‌గా చూపిస్తుంటారు ఆనంద్ మహేంద్రా.


గ్రామీణ వ్యక్తి యొక్క సృజనాత్మకత తనను అబ్బురపరిచిందని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో EV బైక్‌ నడుపుతున్న వ్యక్తి వీడియోను షేర్ చేశారు. బైక్ రూపొందిని వ్యక్తి తన స్నేహితులందరినీ కలిసి రోడ్‌పై జామ్ అంటూ వెడుతున్నాడు.


ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీలు నడపగలదని, ఇందుకోపం రూ.8 నుంచి రూ.10 మాత్రమే ఖర్చవుతుందని బైక్ సృష్టికర్త పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ వస్తువు తయారు చేయడానికి అయిన ఖర్చు కేవలం రూ. 10-12 వేలు మాత్రమే అని తెలిపాడు.


"కేవలం చిన్న డిజైన్ ఇన్‌పుట్‌లతో తయారైన ఈ పరికరం మరికొన్ని కొత్త ఆవిష్కరణలకు తెరలేపుతోంది అని ఆనంద్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గ్రామీణ రవాణా ఆవిష్కరణలు తనను ఎప్పుడూ ఆకట్టుకుంటాయని ఆయన తెలిపారు. ఇక్కడ అవసరాలు ఆవిష్కరణకు తల్లి అని ఆనంద్ మహీంద్రా గురువారం ట్వీట్ చేశారు. అతని వీడియోకు 634.4k పైగా వీక్షణలు, 35k పైగా లైక్‌లు మరియు 4k పైగా రీట్వీట్‌లతో మంచి స్పందన లభించింది.


అయితే, ఒక ట్విట్టర్ వినియోగదారు మాత్రం ఈ భావనను వ్యతిరేకించారు. జూ, పార్క్, కార్ప్ కాంప్లెక్స్‌ల వంటి వాటికి అయితే ఇది పనికొస్తుందని, కానీ ట్రాఫిక్‌ ఉన్న ఏరియాల్లో దీన్ని నడపడం సాధ్యం కాదని అన్నాడు. టర్నింగ్ తీసుకోవడం, గతుకుల రోడ్లపై నడపడం, లగేజీకి స్థలం లేకపోవడం, అధిక లోడ్‌ ఉన్నప్పుడు బ్యాటరీ సామర్థ్యం సరిపోదు అని ఈ బైక్‌కు ఉన్న కొన్ని సమస్యలను లేవనెత్తాడు.


మైనస్ పాయింట్లు తెలిస్తేనే కదా మరో కొత్త ఆవిష్కరణ జరిగేది అని మరికొందరు నెటిజన్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.


Tags

Next Story