Anvesh : అన్వేష్ ఓ గే.. చిట్టి పికిల్స్ రమ్య కోసం పెద్ద ప్లాన్

నా అన్వేషణ అనే యూ ట్యూబ్ ఛానల్ తో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యాడు అన్వేష్. దేశాలన్నీ తిరుగుతూ అక్కడి వింతలు విశేషాలు తన ఛానల్ లో పంచుకుంటాడు. వింతైన భాషతో, వివరణాత్మక విశ్లేషణలతో ఆకట్టుకుంటూ ఉంటాడు. కొన్నాళ్లుగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారి వివరాలు చెబుతూ.. వారి వల్ల నష్టపోయిన వారి కుటుంబాలను తను ఆదుకుంటా అంటూ వీడియోలు చేస్తున్నాడు. దీంతో అతను చాలామంచి వాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫాలోవర్స్. అయితే అదంతా కేవలం డ్రామా అనీ.. అతనితో జనాలకు తెలియని మరో కోణం ఉందని చెబుతూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు మరో యూ ట్యూబర్ ఉజ్వల్.
అతను చెప్పిన ఆరోపణల్లో ప్రధానంగానూ సెన్సేషనల్ గానూ కనిపిస్తోంది.. అతను ఆటగాడు కాదు.. గే అనే మాట. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం వెళ్లినా ఆ దేశం ఆడవారిని తన వీడియోల్లో చూపిస్తూ తనేదో ఆటగాడిని అనే కలరింగ్ ఇస్తాడని.. అలా చేస్తే తప్ప అతని వీడియోస్ కు వ్యూస్ రావంటున్నాడు. అంతే కాదు.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి గురించి అతను చెబుతున్న అంశాల్లో మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఇక కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన చిట్టి పికిల్స్ అమ్మాయిలతో అతను సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నాడనీ.. మగవాళ్లకు ఐ లవ్యూ చెబుతాడు అంటూ కొన్ని ఆడియో ఫైల్స్ ను ఆధారంగా చూపుతూ ఉజ్వల్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. మరి అతను ఇంకా ఏం చెబుతున్నాడో ఈ ఇంటర్వ్యూ చూస్తే మీకే క్లియర్ గా అర్థం అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com