భారత్ మాతాకీ జై అన్న ఆస్ట్రేలియన్ అభిమాని!

భారత్ మాతాకీ జై అన్న ఆస్ట్రేలియన్ అభిమాని!
గబ్బా స్టేడియంలో నిన్న భారత్, ఆసీస్ జట్ల మధ్య ముగిసిన నాలుగో టెస్ట్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన సంగతి తెలిసిందే.. డ్రాగా ముగుస్తుందనుకున్న ఈ మ్యాచ్ ని ఏకంగా విజయం వైపు మళ్ళించారు భారత క్రికెటర్లు.

గబ్బా స్టేడియంలో నిన్న భారత్, ఆసీస్ జట్ల మధ్య ముగిసిన నాలుగో టెస్ట్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన సంగతి తెలిసిందే.. డ్రాగా ముగుస్తుందనుకున్న ఈ మ్యాచ్ ని ఏకంగా విజయం వైపు మళ్ళించారు భారత క్రికెటర్లు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ పోరాటానికి ఫిదా అయిపోయిన ఓ ఆస్ట్రేలియన్ అభిమాని.. భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశాడు.

నిన్న ఆసీస్ పై గెలవగానే భారత క్రికెటర్లు భారత జెండా పట్టుకొని మైదానంలో తిరుగుతుండగా, స్టాండ్స్ లో కూర్చొని ఉన్న ఓ ఆస్ట్రేలియన్ అభిమాని భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ బిగ్గరగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. దేశసరిహద్దులకు అతీతంగా క్రీడా స్పూర్తిని ప్రదర్శించిన అతన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. అటు ఆసీస్‌ ఆటగాళ్లు, కోచ్‌ సైతం ఇండియన్‌ క్రికెటర్లను తక్కువ అంచనా వేయొద్దని మ్యాచ్‌ ప్రజెంటేషన్‌లో పేర్కొనడం విశేషం!

Tags

Read MoreRead Less
Next Story