Aviation: ఫ్లైట్ లో ఫైట్.. పౌర వైమానిక భద్రతా దళం సీరియెస్

Aviation: ఫ్లైట్ లో ఫైట్.. పౌర వైమానిక భద్రతా దళం సీరియెస్
పౌర వైమానిక భద్రతాళం దృష్టికి వచ్చిన వీడియో; సంఘటనపై విచారణకు ఆదేశం

Aviation: ఫ్లైట్ లో ఇద్దరు ప్రయాణీకుల మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానలా మారి కొట్టుకునే వరకూ వెళ్లిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ఆ గొడవను రికార్డ్ చేసి షోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం పౌర వైమానిక భద్రతా దళం దృష్టకి వెళ్లింది.


బ్యాంకాక్- కోల్ కతా వెళుతున్న థాయ్ స్మైల్ ఎయిర్వే ఫ్లైట్ లో ఇద్దరు ప్రయాణీకుల మధ్య మొదలైన వాగ్వివాదం క్రమంగా ఊపందుకోగా, ఒకరు విచక్షణ కోల్పోయి ఎదుటి వ్యక్తిపై దాడి చేశాడు. దాడి చేస్తున్న వ్యక్తికి సహాయంగా అతని మిత్రులు సైతం తోడయ్యేసరికి ఈ వివాదం కాస్తా ముదిరింది. ఫ్లైట్ సిబ్బంది అతి కష్టం మీద ఇరువురునీ వేరు చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మరింది.


ఇక ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా బీసీఏఎస్ అధికారులు అదేశించారు. ఆ నివేదిక ఆధారంగానే ఎవరి పై చర్యలు తీసుకోవాలన్నది నిర్ణయిస్తామని తెలిపారు.



Tags

Next Story