Sukhibhava Sharath: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ శరత్ బ్యాక్ గ్రౌండ్ ఇది.. అందుకే..!
Sukhibhava Sharath (tv5news.in)
Sukhibhava Sharath: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ అంటూ నెటిజన్లకు పరిచయమయ్యాడు నల్లగుట్ట శరత్. అసలే ఇది సోషల్ మీడియా యుగం. కాస్త వెరైటీగా ఏదైనా కనిపిస్తే చాలు వెంటనే పాపులర్ అవుతుంది. యూత్ కు నచ్చిందీ అంటే అది మీమ్స్ గా మారి వైరల్ అవుతుంది. శరత్ స్టోరీ కూడా ఇంతే. కానీ ఇప్పుడు అతడిపై దాడి జరగడంతో.. అసలు ఎవరీ శరత్.. ఏం చేస్తాడంటూ నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.
అయ్యయ్యో వద్దమ్మ.. పక్కనే టీ కొట్టు పెట్టాను.. అందరికీ కప్పు టీ ఇస్తాను.. డబ్బులు తీసుకోను కాని... సుఖీభవ.. సుఖీభవ.. సుఖీభవ అంటూ తీన్మార్ స్టెప్పులేస్తూ తెగ సందడి చేశాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. యూత్ మొబైల్స్ లో అది హాట్ టాపిక్ గా మారింది. జస్ట్ ఆ మీమ్స్ ను, ఆ వీడియోలను ఫుల్ గా ఫార్వార్డ్ చేసేశారు. దీంతో సుఖీభవ శరత్ గా ఈ కుర్రాడు పాపులర్ అయ్యాడు.
అయ్యయ్యో వద్దమ్మ యాడ్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. కానీ.. సుఖీభవ శరత్ వల్ల అది ఇంకా వైరల్ అయ్యింది. ఇంతలా యూత్ కి నచ్చితే హైదరాబాద్ పోలీసులు ఊరుకుంటారా.. దానినే ఉపయోగించుకుని.. సైబరాబాద్ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రైజ్ మనీ గెలిచారంటూ లింకులు పంపిస్తూ ఆన్ లైన్ మోసాలకు పాల్పడే ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండండంటూ ఓ మీమ్ ను తయారుచేశారు. దానికి ఈ నల్లగుట్ట శరత్ మీమ్ ను బేస్ గా తీసుకున్నారు. అంతే అది కాస్తా తెలుగు స్టేట్స్ లో యూత్ మొబైల్స్ కి చేరిపోయింది. ఎక్కడ చూసినా అదే కనిపించింది.. వినిపించింది.
సుఖీభవ పాటతో.. నల్లగుట్ట శరత్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. మామూలుగానే ఫ్రాంక్స్ చేసేవాళ్లు బాగా పాపులర్ అవుతారు. ఇప్పుడు శరత్ కూడా అలాంటిదే ట్రై చేయడంతో బాగా పేరొచ్చింది. అందుకే హిజ్రాలు ఆయనపై దాడి చేశారంటూ ప్రచారం జరిగింది. కానీ తనను కొట్టింది వాళ్లు కాదని శరత్ క్లారిటీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో.. అసలు ఎవరీ శరత్.. ఏం జరిగింది అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com